NTV Telugu Site icon

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..వడ్డీ రేట్లు పెంపుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం

Epfo

Epfo

ఈపీఎఫ్‌ఓ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ పెంపుదలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

READ MORE: Lavanya Parents Interview: అల్లుడు తిరిగొస్తే చాలు.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య పేరెంట్స్

గత సంవత్సరం వడ్డీరేటు.. 8.15% ఉండగా.. ప్రస్తుతం దాన్ని 8.25%కి పెంచింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ఎక్స్” లో సమాచారం అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, ఈపీఎఫ్‌ సభ్యులు 8.25% వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారని తెలిపింది. ఇప్పటికీ పదవీ విరమణ చేసి వెళ్తున్న చందాదారులకు సవరించిన కొత్త వడ్డీ రేట్లను వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్లోనే చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. దీని అర్థం ఎవరైతే ఈపీఎఫ్ సభ్యులు రిటైర్ అవుతున్నారో వారికి గత ఏడాదికి సంబంధించిన కొత్త వడ్డీ రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారమే పీఎఫ్ తుది సెటిల్మెంట్ చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు.. త్రైమాసిక పద్ధతిన వడ్డీ రేట్లు వెల్లడించడం కుదరదని, వార్షిక వడ్డీ రేటును ఆర్థిక ఏడాది ముగిసిన తర్వాత తొలి త్రైమాసికంలో మాత్రమే వడ్డీ రేట్ల సవరణ ఉంటుందని తెలిపింది.