Site icon NTV Telugu

Gold Supplying Banks: భారత్‌కు బంగారం బంద్‌. అందుకే రేట్లు పెరిగాయా?

Gold Supplying Banks2

Gold Supplying Banks2

Gold Supplying Banks: గోల్డ్‌ సప్లై బ్యాంక్‌లు ఇండియాకి షిప్‌మెంట్లను తగ్గించాయి. మన దేశానికి బదులుగా చైనా, టర్కీ మరియు ఇతర మార్కెట్లకు బంగరాన్ని తరలించాయి. ఇండియాలో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన కన్నా ఆయా దేశాల్లోనే బెటర్‌ ప్రీమియమ్‌ ఆఫర్లు ఉండటంతో అటు వైపు ఫోకస్‌ పెట్టాయి. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్‌ మార్కెట్‌ అయిన ఇండియాలో బంగారం కొరత నెలకొననుంది. గిరాకీ ఎక్కువగా ఉండే ఈ సీజన్‌లో సరఫరా తక్కువగా ఉండటం వల్ల భారతీయులు అధిక ధరకు పసిడిని కొనాల్సిన పరిస్థితి వస్తుందని, అందుకే లేటెస్ట్‌గా గోల్డ్ రేట్లు పెరిగాయేమోనని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇండియాకి లీడింగ్‌ గోల్డ్‌ సప్లయర్స్‌గా ఐసీబీసీ స్టాండర్డ్‌ బ్యాంక్‌, జేపీ మోర్గాన్‌, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ పేరొందాయి.

ఆక్వా హెల్త్‌ కేర్‌లోకి హైదరాబాద్‌ సంస్థ

హైదరాబాద్‌కి చెందిన ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌.. ఆక్వా కల్చర్‌లోని హెల్త్‌ కేర్‌ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చెరువుల్లో రొయ్యలు, చేపల పంపకానికి సంబంధించిన ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ప్రొడక్టుల జాబితాలోకి వ్యాక్సిన్లతోపాటు దశల వారీగా మరికొన్నింటిని తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ సంస్థ ఇప్పటికే మనుషులు సహా వివిధ జంతువులకు కావాల్సిన టీకాలను తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. రొయ్యలు, చేపల కోసం వ్యాక్సిన్లను, హెల్త్‌కేర్‌ ప్రొడక్టులను రూపొందించటం వల్ల యాంటీబయాటిక్స్‌ వాడకం తగ్గుతుందని పేర్కొంది.

read also: KCR National Party: నేడే జాతీయ పార్టీ ప్రకటన.. గులాబీ దళంలో జోష్‌

నాట్కో నుంచి పంటల మందులు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే నాట్కో ఫార్మా సంస్థ.. పంటలకు సంబంధించిన రెండు మందులను ఉత్పత్తి చేసింది. క్లోరాం ట్రానిలిప్రోల్‌ ఆధారంగా ఈ రెండు క్రిమిసంహారిణిలను తయారుచేసి రైతులకు అందుబాటులో ఉంచింది. నాట్వాల్‌, ఫ్లెక్స్‌, యాంప్లిగో బ్రాండ్‌లతో ఈ ప్రొడక్టులను రూపొందించామని తెలిపింది. వీటి మార్కెట్‌ విలువ 800 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ రెండు మందులను వివిధ పంటలకు వాడుకోవచ్చని పేర్కొంది.

Exit mobile version