Site icon NTV Telugu

Gold Price Drop: బంగారం కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పాతాళానికి పడిపోయిన రేట్లు!

Gold Price Drop

Gold Price Drop

Gold Price Drop: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రంప్.. తాజా ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో పెను సంచలనం నమోదైంది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు ద్రవ్యోల్బణంపై గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తించడంతో, బంగారం, వెండి అమ్మకాలకు ఒక్కసారిగా భారీ ఒత్తిడి ఎదురైంది. దీని ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపించింది. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే భారత స్టాక్ మార్కెట్లు తొలుత కుప్పకూలినప్పటికీ, రోజు ముగిసే సమయానికి కోలుకోవడం విశేషం. సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో ముగిసి ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చింది. అయితే, స్టాక్ మార్కెట్ కోలుకున్నా బులియన్ మార్కెట్ మాత్రం కోలుకోలేకపోయింది. వెండి ధరలు ఊహించని రీతిలో పతనమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే వెండి ధర 8 శాతం క్షీణించి కిలో రూ. 2,24,500 వద్దకు చేరుకుంది. ఒకే రోజులో కిలో వెండిపై సుమారు రూ.19,000 మేర భారీ తగ్గుదల నమోదైంది.

READ ALSO: First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి అరుదైన ‘రామాయణ’ విశేషాలు ఇవే!

మరోవైపు పసిడి ధరలు కూడా అదే బాటలో పయనించాయి. గురువారం ట్రేడింగ్ సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 4 శాతం మేర పడిపోయి, 10 గ్రాముల బంగారం రూ.1,47,100కి చేరింది. గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి ఏకంగా రూ.4,25,000కు, 10 గ్రాముల బంగారం ధర రూ.1,93,096కు పెరిగి రికార్డు సృష్టించాయి. ప్రస్తుత ధరలతో పోలిస్తే వెండి దాని గరిష్ఠ స్థాయి నుంచి సుమారు రూ.2 లక్షలు, బంగారం సుమారు రూ.45 వేలు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి.

పెట్టుబడిదారులకు గత ఏడాది కాలంలో బంగారం 70 శాతానికి పైగా రాబడిని అందించగా, వెండి ధర రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అందుకే ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గత నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం కూడా ఈ లోహాల ధరలపై ఒత్తిడి పెంచింది. అయితే, పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్లు, గ్రీన్ ఎనర్జీ రంగాలలో వెండి వినియోగం పెరుగుతుండటంతో, పెట్టుబడిదారులు వెండి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

READ ALSO: Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

Exit mobile version