Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే

Gold Silver

Gold Silver

కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం పెంపు, సిల్వర్ దిగుమతులపై ఆంక్షలు విధించడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు పసిడి, వెండి ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి.గత కొన్ని రోజులుగా గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. నేడు పుత్తడి ధరలు మరోసారి తగ్గాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 710 తగ్గింది. వెండి ధర మాత్రం రూ. 10000 పెరిగింది.

ఈ రోజు హైదరాబాద్‌ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.15,622, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,320, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,717 గా ఉన్నాయి.

ఈ రోజు హైదరాబాద్‌ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,56,220 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.1,43,200 వద్దకి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,370 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,350 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో సిల్వర్ ధర రూ. 10000 పెరగడంతో రూ.3,00,000 వద్ద సేల్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 10000 పెరిగి రూ. 2,90,000 వద్దకి చేరింది.