Gold Rate From 1947 to 2022: భారత్‌లో ధరలతో సంబంధం లేకుండా పసిడి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ధరలు పెరిగినప్పుడు కాస్త వెనుకడుగు వేసినట్టు కనిపించినా.. కొనడం తగ్గించుకుంటారేమో కానీ.. కొనడం మాత్రం ఆపరు.. అంటే బంగారంతో భారతీయులకు ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. అయితే, ఇక్కడ వారివారి ఆర్థిక పరిస్థితులను బట్టి.. బంగారం కొనేస్తుంటారు.. ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శనివారం రూ.1,630 పెరిగి రూ.60,320కి చేరింది.. అంటే.. రూ.60 వేల మార్క్‌ను పసిడి దాటేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,500 మేర పెరిగి రూ.55,300కి పరుగులు పెట్టింది. మరోవైపు కిలో వెండి సైతం రూ.1,300 మేర ఎగబాకి రూ.74,400ని తాకింది..
Read Also: Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా..
ఇక, గత 10 రోజుల్లోనే పసిడి ధర దాదాపు రూ.5 వేల ఎగబాకింది.. మార్చి 9వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 55,530గా ఉండగా.. అదే 18వ తేదీ వరకు వచ్చేసరికి రూ.60,320కి పెరిగింది.. అయితే.. ఇదే సమయంలో.. భారత్‌లో ఎప్పుడెప్పుడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. అనేది ఇప్పుడు చర్చగా మారింది.. భారత్‌కు స్వాతంత్ర్యం రాక ముందు.. పసిడి ధరలు ఎలా ఉన్నాయి..
స్వతంత్ర భారతంలో ధరల గమనం ఎలా సాగింది అనేది ఓసారి పరిశీలిస్తే.. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.44గా ఉంది.. ఆ తర్వాత ఐదేళ్లలోనే ధర రెట్టింపై దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అంటే. 1947లో తులం బంగారం రూ.88గా ఉంది.. 1950లో రూ.100గా, 1960లో రూ.112గా, 1970లో రూ. 184గా, 1980లో రూ.1,330గా.. 1990లో రూ.3,200గా.. 2000లో రూ.4,400గా.. 2010లో రూ.18,500గా.. 2020లో రూ.42,700గా.. 2021లో రూ.48,700గా.. 2022లో రూ.52,700గా.. ఇలా పసిడి ధర ఏమాత్రం తగ్గకుండా ఎగబాకిపోయింది. అంటే, ఈ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో బంగారం ధర దాదాపు 682 రెట్లు పెరిగిపోయింది.. ఇప్పుడు రూ.60 వేల మార్క్‌ను కూడా దాటేసింది.. ఇప్పటికైనా పసిడి పరుగులకు బ్రేక్‌లు పడతాయా? అంటే చెప్పడం మాత్రం కష్టమే..