గోల్డ్ లవర్స్‌కు మళీ షాక్ తగిలింది. పసడి ధరలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. భారత్‌పై ట్రంప్ విధించిన జరిమానా సుంకం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. 50 శాతం సుంకం అమల్లోకి రానున్న నేపథ్యంలో మళ్లీ పుత్తిడి ధరలు పెరిగిపోయాయి. సిల్వర్ ధర మాత్రం ఉపశమనం కలిగించింది.
ఇది కూడా చదవండి: Trump: ఆ కార్డులాడితే చైనా వినాశనమే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈరోజు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరగగా.. 22 క్యారెట్ బంగారం ధర రూ.500 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,060 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ బంగారం ధరర రూ. 410 పెరిగి.. రూ.76,550 దగ్గర ట్రేడ్ అవుతుంది.
ఇది కూడా చదవండి: Trump-Modi: రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!
వెండి ధర మాత్రం ఉపశమనం కలిగిస్తోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి.. రూ.1,20,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.1,30,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.1,20,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.
