Gold Record price: పశ్చిమాసియా ఎఫెక్ట్.. ఆల్ టైం రికార్డు స్థాయిలో పసిడి ధరలు
- అమెరికా ఎన్నికలు.. పశ్చిమాసియా ఎఫెక్ట్ కొండెక్కిన పసిడి ధరలు
- ఆల్ టైం రికార్డు ధరకు గోల్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా పెరిగిన ఆభరణాల ధరలు చూసి పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ రాబోతుంది. ముహూర్తాలు దగ్గర పడడంతో బంగారం, వెండి కొనేందుకు సిద్ధపడుతుండగా అమాంతంగా ఒక్కసారి పెరిగిన ధరలు చూసి అవాక్కు అవుతున్నారు. ధరల పెరుగుదలతో సామాన్యులైతే బెంబేలెత్తిపోతున్నారు. ఇలాగైతే ఎలా కొనగలం అంటూ ఆలోచనలో పడ్డారు. శుభకార్యం వచ్చిందంటే.. ఏ స్థాయి వాళ్లైనా బంగారం కొనకుండా ఉండరు. అలాంటిది ఒక్కసారిగా పెరిగిన ధరలతో ఉలిక్కిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: PKL 11: తెలుగు టైటాన్స్ మరో ఓటమి..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడా? వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గెలుస్తారా? అన్న అనిశ్చితి నెలకొంది. ఇంకోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్- హిజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. మంగళవారం బంగారం ధరలు రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.80 వేల వరకు ఉండడంతో కొనాలంటేనే పసిడి ప్రియులు భయపడుతున్నారు. అసలే రాబోయేది పెండ్లిళ్ల సీజన్ కావడం.. ఈనేపథ్యంలో బంగారం ఎంతో కొంత తప్పనిసరిగా కొనాల్సి రావడంతో ఇప్పుడే భారీ మొత్తంలో డబ్బులు పెట్టి మరి కొనుగోలు చేస్తున్నారు. మరింత పెరగకముందే జాగ్రత్త పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Drishyam Style Murder: “దృశ్యం” తరహాలో ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ జవాన్..
దేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర శనివారం 72,930 పలికింది. అదే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.రూ.79,420కి చేరింది. వివిధ రకాల పన్నులు కలుపుకుని ఇది దాదాపు రూ.80 వేలు దాటింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి హైదరాబాద్‌లో రూ. 72,800 పలికింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పశ్చిమాసియాలో వరుసగా కొనసాగుతున్న యుద్ధ భయాలతో బంగారం ధర 2024లో ఇప్పటివరకు 30 శాతం పెరిగింది. వెండి కూడా కిలో రూ.1,07,000లకు చేరుకున్నది. జీఎస్టీ లాంటి పన్నులు కలుపుకుంటే ఇది మరింత ఎక్కువ కానుంది.
40 లక్షల వివాహాలు
దేశంలో పండుగల సీజన్ ముగిసిన తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతుంది. నవంబర్-డిసెంబర్‌లో పెళ్లిళ్ల సీజన్ ఉండనుంది. రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సుమారు 40 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. ఈ రెండు నెలల పాటు జరిగే వివాహాలకు సుమారు రూ.4 లక్షల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. ఈ ఖర్చులో బంగారు కొనుగోలు సైతం ప్రభావాన్ని చూపిస్తుంది. దేశంలో ఏ మతానికి చెందిన పెండ్లి జరిగినా ఖచ్చితంగా అబ్బాయి, అమ్మాయికి బంగారం పెట్టాల్సిందే. గోల్డ్ పెట్టడమూ ఓ ప్రెస్టేజ్‌గా తీసుకుంటారు. ఎంత ధర ఉన్నా.. కొనుగోలు చేసి పెడుతుంటారు. ఈ రెండు నెలల్లో కొనుగోలు ఎక్కువగా ఉండటం, డిమాండ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధర విపరీతంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!