NTV Telugu Site icon

Gold Record price: పశ్చిమాసియా ఎఫెక్ట్.. ఆల్ టైం రికార్డు స్థాయిలో పసిడి ధరలు

Gold

Gold

తాజాగా పెరిగిన ఆభరణాల ధరలు చూసి పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ రాబోతుంది. ముహూర్తాలు దగ్గర పడడంతో బంగారం, వెండి కొనేందుకు సిద్ధపడుతుండగా అమాంతంగా ఒక్కసారి పెరిగిన ధరలు చూసి అవాక్కు అవుతున్నారు. ధరల పెరుగుదలతో సామాన్యులైతే బెంబేలెత్తిపోతున్నారు. ఇలాగైతే ఎలా కొనగలం అంటూ ఆలోచనలో పడ్డారు. శుభకార్యం వచ్చిందంటే.. ఏ స్థాయి వాళ్లైనా బంగారం కొనకుండా ఉండరు. అలాంటిది ఒక్కసారిగా పెరిగిన ధరలతో ఉలిక్కిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: PKL 11: తెలుగు టైటాన్స్ మరో ఓటమి..

రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడా? వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గెలుస్తారా? అన్న అనిశ్చితి నెలకొంది. ఇంకోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్- హిజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. మంగళవారం బంగారం ధరలు రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.80 వేల వరకు ఉండడంతో కొనాలంటేనే పసిడి ప్రియులు భయపడుతున్నారు. అసలే రాబోయేది పెండ్లిళ్ల సీజన్ కావడం.. ఈనేపథ్యంలో బంగారం ఎంతో కొంత తప్పనిసరిగా కొనాల్సి రావడంతో ఇప్పుడే భారీ మొత్తంలో డబ్బులు పెట్టి మరి కొనుగోలు చేస్తున్నారు. మరింత పెరగకముందే జాగ్రత్త పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Drishyam Style Murder: “దృశ్యం” తరహాలో ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ జవాన్..

దేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర శనివారం 72,930 పలికింది. అదే హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.రూ.79,420కి చేరింది. వివిధ రకాల పన్నులు కలుపుకుని ఇది దాదాపు రూ.80 వేలు దాటింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి హైదరాబాద్‌లో రూ. 72,800 పలికింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పశ్చిమాసియాలో వరుసగా కొనసాగుతున్న యుద్ధ భయాలతో బంగారం ధర 2024లో ఇప్పటివరకు 30 శాతం పెరిగింది. వెండి కూడా కిలో రూ.1,07,000లకు చేరుకున్నది. జీఎస్టీ లాంటి పన్నులు కలుపుకుంటే ఇది మరింత ఎక్కువ కానుంది.

40 లక్షల వివాహాలు
దేశంలో పండుగల సీజన్ ముగిసిన తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతుంది. నవంబర్-డిసెంబర్‌లో పెళ్లిళ్ల సీజన్ ఉండనుంది. రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సుమారు 40 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. ఈ రెండు నెలల పాటు జరిగే వివాహాలకు సుమారు రూ.4 లక్షల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. ఈ ఖర్చులో బంగారు కొనుగోలు సైతం ప్రభావాన్ని చూపిస్తుంది. దేశంలో ఏ మతానికి చెందిన పెండ్లి జరిగినా ఖచ్చితంగా అబ్బాయి, అమ్మాయికి బంగారం పెట్టాల్సిందే. గోల్డ్ పెట్టడమూ ఓ ప్రెస్టేజ్‌గా తీసుకుంటారు. ఎంత ధర ఉన్నా.. కొనుగోలు చేసి పెడుతుంటారు. ఈ రెండు నెలల్లో కొనుగోలు ఎక్కువగా ఉండటం, డిమాండ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధర విపరీతంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.