శ్రావణ మాసంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గోల్డ్ లవర్స్‌కు ధరలు షాకిస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లు కారణంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. రోజురోజుకు ధరలు పైపైకి వెళ్లిపోతున్నాయి. కొనాలంటేనే పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. వెండి ధరలు మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాయి. తులం బంగారం ధర రూ. 760 పెరిగింది.
ఇది కూడా చదవండి: Tamannaah Bhatia: పాకిస్తాన్ క్రికెటర్‌ను పెళ్లి చేసుకున్నా.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 760 రూపాయలు పెరిగి.. రూ.1,03, 310 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 700 రూపాయిలు పెరిగి.. తులం బంగారం ధర రూ. 94,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర 580 రూపాయిలు పెరిగి 10 గ్రాముల ధర రూ.77,490 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Putin: జెలెన్‌స్కీతో ఎలాంటి చర్చలుండవు.. ట్రంప్-పుతిన్ భేటీ ఉంటుందన్న రష్యా దౌత్యవేత్త
వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. కేజీ వెండి రూ.1,17, 000 దగ్గర ట్రేడ్ అవుతుంది. చెన్నైలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.1, 27, 00 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ.1,17,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.
