NTV Telugu Site icon

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన బంగారం ధరలు

Gold

Gold

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. గత కొద్దిరోజులుగా హడలెత్తించిన బంగారం ధరలు.. గత వారం నుంచి వరుసగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కూడా మరోసారి భారీగా ధరలు తగ్గాయి. ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నేడు తులం బంగారం ధర రూ.330 తగ్గింది. ఇక బులియన్ మార్కెట్‌లో 22 క్యాకెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గడంతో రూ.81, 850 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 తగ్గడం 89,290 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Minister Narayana: రాజధాని పనులు పరిశీలించి మంత్రి నారాయణ.. కీలక వ్యాఖ్యలు..