గోల్డ్ లవర్స్‌కు మళ్లీ ధరలు షాకిస్తున్నాయి. నిన్నామొన్నటి దాకా ధరలు అటు.. ఇటుగా ఊగిసలాడుతూ ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గత మూడు రోజులుగా పసిడి ధర లక్షకు పైగా కొనసాగింది. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు.
ఇది కూడా చదవండి: YS Jagan: పొదిలిలో గలాటా సృష్టించాలని టీడీపీ కార్యకర్తల ప్లాన్.. ఇది పద్ధతేనా చంద్రబాబు..?
తాజాగా ఆ ధరలు మరింత ఎగబాకాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.250 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.280 పెరిగింది. దీంతో శనివారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93, 200 కాగా… 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1, 01, 680గా ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర మాత్రం యధావిధిగాగా కొనసాగుతోంది. శుక్రవారం ఉన్న ధరే శనివారం కొనసాగుతోంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,10,000గా నమోదైంది.
ఇది కూడా చదవండి: Rajasthan: భార్య తప్పుడు కట్నం ఆరోపణలు.. అత్తింటి ముందే ‘‘టీ’’ స్టాల్ పెట్టి భర్త నిరసన ..
