Gold Price: బంగారంపై భారతీయులకు ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి అలాంటి కనకం ఇప్పుడు కొండెక్కింది. అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధర గణనీయంగా పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డబ్బుకు బదులు బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి.. బిజినెస్ చేసే వాళ్లు చాలా మందే ఉన్నారు. బంగారం ఎంత ఎక్కువ అయితే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు. అంతే కాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. హెచ్చు తగ్గులు నమోదవుతుంటాయి.
Read also: Bhakti TV Live: పుష్యపూర్ణిమ శుభవేళ ఈ స్తోత్రాలు వింటే భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి
ఇక జనవరి 6, 2023న పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం తాజా ధర రూ.51,300. నిన్నటితో పోలిస్తే.. రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.55,960 వద్ద స్థిరపడింది. ఇక రాను రాను బంగారం ధరలు 60 వేలకు చేరుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో మధ్య తరగతి ప్రజలు బంగారం అంటేనే భయపడుతున్నారు. దానికి తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనాల్సిందే.. దీంతో పసిడి ధరలు పై పైకి ఎగబాకుతుండటంతో పెళ్లి కోసం ఖర్చు పెట్టేదానికన్నా.. ఎక్కువగా బంగారంపైనే డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తుందనే భయం మొదలైంది.
మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదు. నిన్నటి ధరలు నేటికీ కొనసాగుతున్నాయి. భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరల ద్వారా ఫైనల్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ కరెన్సీ కదలికపై ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించి అంతర్జాతీయంగా ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు పెరుగుతాయి. భారతదేశంలో కిలో వెండి ధర రూ.72,000 గా ఉంది.
Read also: Bhakti TV Live: పుష్యపూర్ణిమ శుభవేళ ఈ స్తోత్రాలు వింటే భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి
తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.55,960, విజయవాడలో రూ.55,960, విశాఖపట్నంలో రూ.55,960, గుంటూరులో రూ.55,960, నెల్లూరులో రూ.55,960, కాకినాడలో రూ.55,960, కాకినాడలో రూ.55,960గా ఉంది. తిరుపతి, కడపలో రూ.55,960, వరంగల్‌లో రూ.55,960. 55,960, నిజామాబాద్‌లో రూ.55,960, ఖమ్మంలో రూ. 55,960. ఇక 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధరలు బెంగళూరులో రూ.56,010, ముంబైలో రూ.55,960, ఢిల్లీలో రూ.56,110, కోల్‌కతాలో రూ.55,960,చెన్నైలో రూ.57,030గా ఉన్నాయి.
Bhakti TV Live: పుష్యపూర్ణిమ శుభవేళ ఈ స్తోత్రాలు వింటే భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి