బంగారం ప్రియులకు మళ్లీ ధరలు షాకిస్తున్నాయి. గత వారం తగ్గుముఖం పట్టినట్టే పట్టి వీకెండ్‌లో మాత్రం ఝలక్ ఇచ్చింది. ఒక్కసారిగా అమాంతంగా పెరిగింది. సోమవారం కూడా మరోసారి స్వల్పంగా పెరిగింది. తులం బంగారం ధర రూ. 50 పెరిగింది. సిల్వర్ ధర మాత్రం ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం సిల్వర్ ధర యథాస్థితిలోనే ఉంది.
ఇది కూడా చదవండి: Shibu Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం.. శిబు సోరెన్ కన్నుమూత
24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 50 రూపాయలు పెరిగి.. రూ.1,01,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 50 రూపాయిలు పెరిగి.. తులం బంగారం ధర రూ. 92,950 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 40 రూపాయిలు పెరిగి 10 గ్రాముల ధర రూ.76,050 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది ఇలా ఉండగా.. వెండి ధరలు ఉపశమనం కలిగిస్తోంది.. కేజీ వెండి రూ.1,13,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రాంతాల వారీగా నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి. చెన్నైలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.1,23,00 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ.1,13,000 ఉంది.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రికి తప్పిన విమానం ప్రమాదం.. పైలట్ ఏం చేశాడంటే..!
