Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Theft Protection: బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్న ఈ రోజుల్లో, కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నగలను ఇంట్లో ఉంచాలంటేనే భయమేస్తోంది. ఊరెళ్లినా, ఇంట్లో ఉన్నా దొంగల బెడద ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే మన కారుకు, ఆరోగ్యానికి బీమా చేయించుకున్నట్లే.. బంగారు ఆభరణాలకు కూడా ప్రత్యేకంగా గోల్డ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ దిగులే ఉండదు. ఇంట్లో దొంగతనం జరిగినా, అనుకోని ప్రమాదంలో నగలు పాడైనా ఒక్క రూపాయి నష్టపోకుండా ఈ పాలసీ మీ బంగారానికి అండగా నిలుస్తుంది. అసలు నగలకు బీమా ఎలా చేయించాలి? పరిహారం ఎలా అందుతుందో వివరంగా చూద్దాం.
ఇంట్లోని బంగారానికి రక్షణ కల్పించుకోవడానికి రెండు సులభమైన మార్గాలు ఉన్నాయి. మొదటిది స్పెషల్ జ్యువెలరీ ఇన్సూరెన్స్. కేవలం బంగారు నగలకు మాత్రమే ఉద్దేశించిన ఈ పాలసీ దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదాల నుంచి ఆభరణాలకు కవచంలా పనిచేస్తుంది. రెండోది హోమ్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్.. మీరు ఇప్పటికే ఇంటికి బీమా తీసుకుని ఉంటే, దానికి కొద్దిపాటి అదనపు ప్రీమియం చెల్లించి నగలను కూడా ఆ పాలసీలో చేర్చుకోవచ్చు. HDFC ERGO, హోమ్ షీల్డ్ వంటి పాలసీలు ఈ వెసులుబాటును అందిస్తున్నాయి. అయితే ఇంటి బీమా ఉన్నంత మాత్రాన బంగారం దానంతట అదే కవర్ అవ్వదని గుర్తుంచుకుని, నగల వివరాలను ప్రత్యేకంగా పాలసీలో యాడ్ చేయించాలి.
Also Read
- Jimmy Tata: టాటా గ్రూప్‌లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
- Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
- Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
- Edible Oil Imports Surge: వంట నూనెల దిగుమతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు.. 24 శాతం పెరిగిన బిల్లు!
బీమా తీసుకునే ముందు మీ దగ్గరున్న నగల అసలు విలువను లెక్కించి, దానికి సరిపడా కవరేజ్ ఎంచుకోవాలి. ఇందుకోసం బంగారం కొనుగోలు రశీదులు, వాల్యుయేషన్ సర్టిఫికెట్, ఆభరణాలు స్పష్టంగా కనిపించే ఫొటోలు, మీ ఐడీ ప్రూఫ్‌లను బీమా సంస్థకు అందించాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఇంట్లో దొంగలు పడి నగలు ఎత్తుకెళ్తే, ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. ఆ వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారమిచ్చి ఎఫ్ఐఆర్ కాపీ, బంగారం బిల్లులు, పాలసీ డాక్యుమెంట్లు సమర్పించాలి. సంస్థ తరఫున సర్వేయర్ వచ్చి విచారణ జరిపిన తర్వాత, నిబంధనల ప్రకారం మీకు రావాల్సిన పరిహారాన్ని అందిస్తారు.
క్లెయిమ్ చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నగలు దొంగతనానికి గురయ్యాయని నిరూపించే బలమైన ఆధారాలు ఉండాలి తప్ప, “ఇంట్లో పెట్టిన బంగారం కనిపించడం లేదు” అని చెబితే బీమా కంపెనీలు పరిహారం ఇవ్వవు. అందుకే బంగారం కొన్న వెంటనే బిల్లులను జాగ్రత్తగా దాచుకోవడంతో పాటు నగల బరువు, నాణ్యత వివరాలు, ఫొటోలను సిద్ధంగా ఉంచుకోవాలి. సరైన పత్రాలు లేకపోతే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుజాగ్రత్తగా బిల్లులు భద్రపరుచుకుని, తగిన జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. దొంగల భయం లేకుండా మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
-
RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
-
OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!
-
IPL 2027: పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ.. ఎవరి పర్సులో ఎంత..? టాప్‌లో LSG..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!