Site icon NTV Telugu

Gold Rates: మగువలకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

Gold

Gold

పశ్చిమాసియా యుద్ధం మగువలకు బాగా కలిసొచ్చింది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి. మిగతా వస్తువుల ధరలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ కూడా కుదేల్ అవుతోంది. ఇలాంటి తరుణంలో బంగారం, వెండి ధరలు మాత్రం దిగొస్తున్నాయి. గత వారం భారీగా తగ్గిన ధరలు.. ఈ వారం కూడా అదే ఒరవడి కొనసాగుతోంది. ఈరోజు కూడా భారీగా ధరలు తగ్గాయి. తులం గోల్డ్‌పై రూ. 1,960 తగ్గగా.. వెండిపై రూ.5,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: Petrol-Diesel price: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. వదంతులపై కీలక ప్రకటన!

తులం గోల్డ్‌పై రూ.1,960 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,680 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,800 తగ్గడంతో రూ.1,48,00 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,470 తగ్గడంతో రూ.1,21,260 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్

ఈరోజు సిల్వర్ ధర కూడా భారీ ఊరట కలిగించింది. ఈరోజు కిలో వెండి ధరపై రూ.5,000 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,80, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,90,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,80, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version