Site icon NTV Telugu

Gold-Silver Rates: మళ్లీ షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Gold (4)

Gold (4)

గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్. మళ్లీ బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఇటీవల తగ్గినట్టే తగ్గి మళ్లీ ఝలక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభాకార్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమయంలో ధరలు పెరిగిపోవడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 1,910 పెరగగా.. కిలో వెండిపై రూ.5,000 పెరిగింది.

ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,910 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,59,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,750 పెరగడంతో రూ.1,46,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,430 పెరగడంతో రూ.1,19,460 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఈరోజు సిల్వర్ ధర కూడా భారీ షాకిచ్చింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.5,000 పెరగడంతో రూ.2,75, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి రూ.2,90,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా అదే మాదిరిగా రూ.2,75, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version