గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. శుభకార్యాల సమయంలో బంగారం ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెండి ధర మాత్రం షాకిచ్చింది. కిలో వెండిపై రూ.5,000 పెరగగా… తులం గోల్డ్‌పై మాత్రం రూ.1,200 తగ్గింది.
తులం గోల్డ్‌పై రూ.1,200 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,58,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100 తగ్గడంతో రూ.1,45,200 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900 తగ్గడంతో రూ.1,18,800 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇక వెండి ధర భారీ షాకిచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2, 95, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,00,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,95, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
