సిల్వర్ మళ్లీ రికార్డ్‌ల మోత మోగిస్తోంది. దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. గతేడాది వెండి ధర విజృంభించింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా కొత్త ఏడాదిలో కూడా 3 లక్షల మార్కు దాటి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఇప్పుడు మరో రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది. ఏకంగా ఈరోజు కిలో వెండిపై రూ.10, 000 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి 3,18,000 దగ్గర అమ్ముడవుతోంది. అలాగే బంగారం ధర కూడా భారీగానే పెరిగింది. తులం గోల్డ్‌పై రూ.1,910 పెరిగింది.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఖమేనీపై దాడి చేస్తే ఖబడ్దార్.. పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతామని ఇరాన్ వార్నింగ్
ఈరోజు కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,05, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,18,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,05, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-EU: ముదురుతున్న గ్రీన్‌లాండ్ వివాదం.. ఈయూ దేశాలపై ట్రంప్ టారిఫ్ వార్నింగ్
తులం గోల్డ్‌పై రూ.1,910 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,690 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,750 పెరగడంతో రూ.1,33,550 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,430 పెరిగి రూ.1,09,270 దగ్గర ట్రేడ్ అవుతోంది.
