మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. మరికొన్ని రోజుల్లో న్యూఇయర్‌లోకి అడుగుపెట్టబోతున్నాం. ధరలు తగ్గుతాయనుకుంటుంటే పరుగులు పెడుతున్నాయి. ఈ సంవత్సరమంతా పుత్తడి ధరలు హడలెత్తించాయి. కొత్త ఏడాది సమయానికి సరికొత్త రికార్డ్ సృష్టించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సామాన్యులు కొనేందుకు బెంబేలెత్తిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్లలో పసిడి కొనడం ఎలా బాబోయ్ అంటూ జడిసిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.330 పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. నిన్న ఒక్కరోజే రూ.11,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటక తీరంలో చైనీస్ సీగల్ కలకలం.. భద్రతపై అనుమానాలు
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.330 పెరిగి.. రూ.1,34,840 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 300 పెరిగి రూ.1,23,600 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 పెరిగి రూ.1,01,130 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bihar: హిజాబ్ లాగితే తప్పేముంది? నితీష్ కుమార్‌ను వెనకేసుకొచ్చిన కేంద్రమంత్రి
ఇక సిల్వర్ ధర కూడా హడలెత్తిస్తోంది. ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,11, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్‌లో రూ.2,24,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,11, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
