Site icon NTV Telugu

Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. నేటి బంగారం ధరలు ఇలా..!

Gold

Gold

మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మళ్లీ పెరిగిపోయాయి. రోజుకోలాగా బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై రూ.270 పెరగగా.. సిల్వర్ ధర మాత్రం దిగొచ్చింది. ఏకంగా రూ.4,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: RBI: సామాన్యులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. తగ్గనున్న గృహ ఈఎంఐలు

బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.270 పెరిగి రూ.1,29, 930 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 పెరిగి రూ.1,19,100 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.210 పెరిగి రూ.97, 450 దగ్గర ట్రేడ్ అవుతోంది.

వెండి ధర మాత్రం ఈరోజు భారీ ఉపశమనం కలిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,87, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,96,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి రూ.1,87,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: IndiGo Flights: ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం.. తిండి తిప్పలు లేక ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు

Exit mobile version