Site icon NTV Telugu

Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Gold

Gold

మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న కాస్త ఉపశమనం కలిగించిన ధరలు.. ఈరోజు మళ్లీ ఝలక్ ఇచ్చాయి. మంగళవారం మరోసారి భారీగా ధరలు పెరిగిపోయాయి. ప్రతి రోజు ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,910 పెరగగా.. కిలో సిల్వర్‌పై మాత్రం ఏకంగా రూ.4,000 పెరిగింది.

ఇది కూడా చదవండి: Erika Kirk: జేడీ వాన్స్‌ను అందుకే కౌగిలించుకున్నా.. ఎరికా కిర్క్ క్లారిటీ

బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,910 పెరగగా రూ.1,27,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,750 పెరగగా రూ.1,16,450 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,430 పెరగగా రూ.95,280 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Netanyahu: ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. ఇజ్రాయెల్ ప్రధాని భారత్ పర్యటన వాయిదా!

ఇక వెండి ధర కూడా షాకిచ్చింది. కిలో వెండిపై రూ.4,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,67, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,74,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,67, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version