NTV Telugu Site icon

Gold and Silver Rate: గుడ్‌న్యూస్‌.. మరింత తగ్గిన బంగారం ధరలు..

Gold And Silver Rate

Gold And Silver Rate

పసిడి కొనుగోలు చేయాలనేవారికి శుభవార్త చెబుతూ.. వరుసగా బంగారం ధరలు కిందకు దిగివస్తున్నాయి.. వరుసగా మూడోరోజు కూడా పసిడి ధర తగ్గింది. ఇవాళ దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,800లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,050గా ఉంది. అంటే నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గింది.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగివస్తున్నాయి. రెండు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోలిస్తే… 10 గ్రాముల మేలిమి బంగారం 110 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర.. 51,050 రూపాయలు కాగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,800 రూపాయలుగా ఉంది.

Read Also: Elon Musk Twitter: ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం..! ట్విట్టర్‌ ఖాతా ఉంటే డబ్బు కట్టాల్సిందే..!

ఇక చెన్నై మార్గెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయల వరకు తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,900 రూపాయలుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 47,580 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,950గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ. 51,200కి దిగివచ్చింది.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,800గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,050గా ట్రేడ్‌ అవుతోంది.. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,850గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100గా పలుకుతోంది.. మరోవైపు, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,050గా ఉంది.. ఇక… కేజీ వెండి ధర 400 రూపాయలు పెరిగి… 66,700 రూపాయలకు చేరింది.