NTV Telugu Site icon

Gold and Silver Prices: స్థిరంగ పసిడి ధర.. ఈ రోజు ధరలు ఇలా..

Gold

Gold

Gold and Silver Prices: సీజన్‌, ధరలతో సంబంధం లేదు.. ఎప్పుడూ పసిడికి మంచి డిమాండే ఉంటుంది.. కాకపోతే.. కొన్నిసార్లు ఎక్కువ.. మరికొన్నిసార్లు తక్కువ.. అంతే కానీ, బంగారం.. ఎప్పుడూ బంగారమే.. ఇక, ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.58 వేలకు చేరుకుంది. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,060 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,400గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,210గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. రూ.57,060గా ఉంది.

Read Also: Kapil Dev: సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప?..కపిల్ దేవ్ దిమ్మతిరిగే కౌంటర్

ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,040గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 52,250గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,060గాను ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,250గా… 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,060గాను నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. ఇక, వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,300గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో అదే రేటు ఉంది.. చెన్నై, బెంగళూరు, కేరళలో కిలో వెండి ధర రూ.74,300గా పలుకుతుంటే.. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో కిలో వెండి ధర రూ.72,300గా ట్రేడ్‌ అవుతోంది.