Site icon NTV Telugu

Gold-Silver Rates: భారీ ఝలక్ ఇచ్చిన వెండి, బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!

Gold

Gold

వామ్మో.. పెళ్లిళ్లు.. శుభకార్యాల సమయాల్లో మళ్లీ బంగారం ధరలు షాకిచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గత కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు కూడా చాలా సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు లేదు. అంతర్జాతీయ పరిణామాలు తేరుకుంటున్న తరుణంలో ధరలు మరోసారి ఝలక్ ఇచ్చాయి. తాజాగా తులం గోల్డ్‌ ధరపై రూ.700 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది.

ఇది కూడా చదవండి: Iran War: ఖార్గ్ ద్వీపాన్ని ముట్టుకోని అమెరికా.. కారణాలు తెలిస్తే షాక్!

తులం గోల్డ్‌పై రూ.700 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,62,380 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.650 పెరగడంతో రూ.1,48,850 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.530 పెరగడంతో రూ.1,21,790 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఈరోజు సిల్వర్ ధర భారీ షాకిచ్చింది. ఈరోజు కిలో వెండి ధరపై రూ.10,000 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,90, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,00,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,90, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version