ఆషాడ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో శుభకార్యాలు ఏవీ జరుపుకోరు. ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు దాదాపు తగ్గుతాయనే ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గోల్డ్ ధరలు ఆకాశాన్ని తాకాయి. నేడు తులం పుత్తడి ధర రూ. 2,290 పెరిగింది. సిల్వర్ ధర కూడా రూ. 5000 పెరిగింది. మిడిల్ ఈస్ట్ లో చోటుచేసుకుంటున్న ఉద్రికత్తలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల బంగారానికి (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,651, 22 క్యారెట్ల బంగారానికి (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,430 మరియు 18 క్యారెట్ల బంగారానికి (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.10,988 వద్ద సేల్ అవుతోంది.
ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2290 పెరిగి రూ.1,46,510 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2100 పెరిగి రూ.1,34,300 వద్దకి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,560 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,450 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో సిల్వర్ ధర రూ. 5000 పెరగడంతో రూ.2,45,000 వద్ద సేల్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 5000 పెరిగి రూ. 2,40,000 వద్దకి చేరింది.

