Bank Holiday: బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు.. పూర్తి వివరాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Holiday: ఇప్పుడు అంతా ఆన్లైన్ లావాదేవీలే అయినా.. ఎక్కువ మొత్తంలో డబ్బులు తీయాలన్నా..? ఇతర లావాదేవీల కోసం బ్యాంకులపై ఆధారపడాల్సిన పరిస్థితి.. అయితే, ఈ నెలలో మరోసారి బ్యాంకులకు పెద్ద సంఖ్యలో సెలవులు రాబోతున్నాయి.. బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పని ఉందా? అయితే బ్యాంకుకు వెళ్లే ముందు ఈ సెలవు ఉందో లేదో తెలుసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా ప్రకారం సెప్టెంబర్ 18, శుక్రవారం.. అంటే ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఈ సెలవు దేశవ్యాప్తంగా అమల్లో లేదు. మేఘాలయలోని బ్యాంకులు మాత్రమే నేడు మూసి ఉంటాయి.
మేఘాలయలో సెప్టెంబర్ 18న యూనిటేరియన్ యానివర్సరీ డే సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు శాఖలకు సెలవు ప్రకటించారు. ఖాసీ-జైంటియా హిల్స్ ప్రాంతంలో ప్రతి ఏడాది ఈ రోజును నిర్వహిస్తారు. హజోమ్ కిసోర్ సింగ్ 1887 సెప్టెంబర్ 18న జోవాయ్లోని తన ఇంట్లో తొలి యూనిటేరియన్ ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఈ రోజుకు ప్రాధాన్యత ఏర్పడింది. స్థానికంగా ‘కా నియామ్ యూనిటేరియన్’గా పిలిచే ఈ విశ్వాస ఉద్యమం ఖాసీ సంప్రదాయాలు, సామాజిక బాధ్యతలు, మానవ విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సందర్భంగా యూనిటేరియన్ సమాజం ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2026లో మేఘాలయ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 18ను స్థానిక సెలవు దినంగా ప్రకటించింది.
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఇతర రాష్ట్రాల్లో మాత్రం సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి.
సెప్టెంబర్ 18 తర్వాత బ్యాంకు సెలవులు ఇవే..
* సెప్టెంబర్ 18 (శుక్రవారం): యూనిటేరియన్ యానివర్సరీ డే సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
* సెప్టెంబర్ 20 (ఆదివారం): దేశవ్యాప్తంగా వారపు సెలవు.
* సెప్టెంబర్ 21 (సోమవారం): శ్రీమంత శంకరదేవ జన్మోత్సవం, శ్రీ నారాయణ గురు సమాధి సందర్భంగా భువనేశ్వర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
* సెప్టెంబర్ 22 (మంగళవారం): కర్మ పూజ సందర్భంగా రాంచీలో బ్యాంకులకు సెలవు.
* సెప్టెంబర్ 23 (బుధవారం): మహారాజా హరి సింగ్ జీ జయంతి సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు.
* సెప్టెంబర్ 25 (శుక్రవారం): ఇంద్రజాత్ర సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.
* సెప్టెంబర్ 26 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
* సెప్టెంబర్ 27 (ఆదివారం): దేశవ్యాప్తంగా వారపు సెలవు.
కాబట్టి బ్యాంకు శాఖకు వెళ్లి పని చేసుకునే ముందు మీ ప్రాంతానికి వర్తించే సెలవు జాబితాను ఒకసారి పరిశీలించడం మంచిది. రాష్ట్రం, నగరం ఆధారంగా బ్యాంకు సెలవులు మారుతుండటంతో ముందుగా నిర్ధారించుకోవడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!