Site icon NTV Telugu

Gold Rates: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.450 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,370గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48వేలుగా నమోదైంది. అటు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.వెయ్యి తగ్గి రూ.69వేలకు చేరింది. అటు ఏపీలోని విశాఖ మార్కెట్‌లోనూ ఇవే బంగారం ధరలు అమలవుతున్నాయి.

కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పసిడికి గిరాకీ తగ్గిందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. 2021 జనవరి-మార్చి కాలంలో 165.8 టన్నుల బంగారం విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది అదే కాలంలో 18 శాతం విక్రయాలు తగ్గిపోయాయి. బంగారం ధర బాగా పెరగడమే దీనికి కారణమని డబ్ల్యూజీసీ వివరణ ఇచ్చింది. కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్లే ధర పెరిగిందని.. తగ్గిన తర్వాత బంగారం కొనుగోలు చేద్దామని ప్రజలు కూడా పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ధరలు పెరగడంతో పాత బంగారాన్న తెచ్చి కొత్త ఆభరణాలు చేయించుకుంటున్నారు. మరోవైపు బంగారంపై పెట్టుబడులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరిగాయి.

PM Modi: పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు.. అందుకే ధరలు తగ్గడం లేదు

Exit mobile version