Gold Silver Price Today: బంగారం ధరలు మరింత పైకి ఎగబాకాయి.. ఇండియన్ బులియన్ జువెలర్స్ వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు మరింత పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,300 నుంచి రూ.53310కి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,130 నుంచి రూ.58,140కి పెరిగింది.. దీంతో.. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ 10 రూపాయాలు పెరిగింది.. వెండి ధర స్థిరంగా కొనసాగుతూ.. కిలో ధర రూ.68,500 దగ్గర ట్రేడ్ అవుతోంది.. భారతదేశంలో బంగారం మరియు వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్‌లో ట్రేడింగ్ ద్వారా నిర్ణయించబడుతుంది. ట్రేడింగ్ రోజు చివరి ముగింపు మరుసటి రోజు మార్కెట్ ధరగా పరిగణించబడుతుంది. అయితే, కొన్ని ఇతర ఛార్జీలతో పాటు వివిధ నగరాల్లో రేటును నిర్ణయించి, ఆపై రిటైలర్ మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తూ ఆభరణాలను విక్రయిస్తారు.
Read Also: Heavy Rains: నేటి నుంచి భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై అధిక ప్రభావం..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ట్రేడ్ అవుతున్నాయో ఓసారి పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,910గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,810గా.. కిలో వెండి ధర రూ.72000గా ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,160గా, 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.57,990గా.. కిలో వెండి ధర రూ.68,500గా కొనసాగుతోంది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.53,160గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,040గా.. కిలో వెండి ధర రూ.68,500గా అమ్ముడుపోతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,210గా, 24 క్యారెట్ల ధర రూ.58,040గా.. కిలో వెండి ధర రూ.72,000గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,160గా.. 24 క్యారెట్ల ధర రూ.57,990గా.. కిలో వెండి ధర రూ.72వేలుగా ట్రేడింగ్‌లో ఉంది. కేరళ, పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,160గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,990గా, కిలో వెండి ధర రూ.68,500గా ఉంది.