ధరలు పెరిగినా, తగ్గినా.. పసిడికి ఉన్న గిరాకీ మాత్రం తగ్గడంలేదు.. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46,250గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,450గా ఉంది. అటు వెండి ధరలో మాత్రం కొంత పెరుగుదల నమోదైంది. వెండి నిన్నటితో పోలిస్తే తులానికి 8 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం తులం వెండి ధర 645 రూపాయలుగా ఉంది. కాగా, కొద్ది రోజులుగా పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతుండగా.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.
Read Also: YS Jagan: భారీ విద్యుత్ ప్రాజెక్టు.. నేడే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన