NTV Telugu Site icon

Gold Price: పసిడి పైపైకి.. రూ.51 వేలు దాటేసి..

Gold

Gold

భారత్‌లో బంగారం ధర మళ్లీ పైపైకి ఎగబాకుతోంది.. రూ.51 వేల మార్క్‌ను మళ్లీ క్రాస్‌ చేసి దూసుకుపోతోంది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నవంబర్‌ 19 తర్వాత ఇదే గరిష్ఠస్థాయి కాగా.. భవిష్యత్‌లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా పెరుగుతోంది.. ఇవాళ రూ.100 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050కి చేరింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800కు చేరింది.. ఇక పసిడి దారిలోనే వెండి నడుస్తోంది.. రూ.500 పెరగడంతో కిలో వెండి ధర రూ.67,400కు ఎగసింది.. ఏపీలోని విజయవాడ, విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Read Also: Statue Of Equality: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ట్రాఫిక్‌ ఆంక్షలు విధింపు

భారత్‌లోని ఇతర నగరాల్లోనూ మళ్లీ బంగారం ధర పెరుగుతూ పోతింది.. చెన్నైలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,530గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,760గా కొనసాగుతోంది.. ఇక, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050కి చేరింది.. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి పైకి కదిలింది.. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్‌ కూడా కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.