Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- తప్పు ఒప్పుకోలేదు.. కానీ రూ. 150 కోట్లు కడతాం
- న్యూయార్క్ కోర్టులో అదానీల సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అమెరికాలో భారీ షాక్ తగిలింది. వీరిద్దరిపై మొత్తం 18 మిలియన్ డాలర్ల (సుమారు రూ.150 కోట్లు) పౌర ద్రవ్య జరిమానా (Civil Monetary Penalties) విధించాలని యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు సంబంధించిన ఒక వివాదంలో ఈ ముందస్తు జరిమానాలు చెల్లించడానికి అదానీలు అంగీకరించారు.
అసలు వివాదం ఏంటి..
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 2021లో చేపట్టిన బాండ్ ఆఫరింగ్‌కు సంబంధించి.. పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించేలా అబద్ధపు ప్రకటనలు చేశారనేది ప్రధాన ఆరోపణ. భారతదేశంలో భారీ సౌరశక్తి (సోలార్ పవర్) కాంట్రాక్టులను దక్కించుకోవడానికి అదానీలు ఒక పెద్ద లంచాల పథకాన్ని రూపొందించారని, అయితే అమెరికా పెట్టుబడిదారుల వద్దకు వచ్చేసరికి తాము ఎలాంటి అవినీతి పద్ధతులు పాటించడం లేదంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని యూఎస్ ఏజెన్సీలు నిర్ధారించాయి.
Also Read
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
- Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
- UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
ఎవరిపై ఎంత జరిమానా అంటే..
ఎస్ఈసీ (SEC) ప్రతిపాదించిన ఈ జరిమానాలో భాగంగా.. గౌతమ్ అదానీపై 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.50 కోట్లు), సాగర్ అదానీపై 12 మిలియన్ డాలర్లు (సుమారు రూ.100 కోట్లు) జరిమానా విధించారు. “సివిల్ ఫిర్యాదులో చేసిన ఆరోపణలను మేము అంగీకరించడం లేదు.. అలాగని ఖండించడం లేదు. కానీ, కోర్టు తుది తీర్పును గౌరవిస్తూ వరుసగా 6 మిలియన్ డాలర్లు, 12 మిలియన్ డాలర్ల సివిల్ జరిమానా చెల్లించడానికి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ అంగీకరించారు” అని అదానీ గ్రీన్ ఎనర్జీ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది. మే 14న న్యూయార్క్ కోర్టులో దాఖలు చేసిన ప్రతిపాదిత తుది తీర్పులలో ఈ జరిమానాలు ఒక భాగంగా ఉన్నాయి.
రూ. 2200 కోట్ల లంచాల ఆరోపణలు!
గతేడాది (2024) నవంబర్‌లో ఈ సంచలన అవినీతి కుంభకోణం బయటపడింది. ఒక ప్రధాన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే రెండు దశాబ్దాలలో దాదాపు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,600 కోట్లు) లాభాలను ఆర్జించేలా కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం.. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,200 కోట్లు) లంచాలు ఇవ్వడానికి అదానీలు పథకం వేశారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
అవినీతిని దాచిపెట్టి రూ. 25,000 కోట్ల సమీకరణ
ఈ మొత్తం లంచాల వ్యవహారాన్ని, అవినీతిని అంతర్జాతీయ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి దాచిపెట్టి.. రుణాలు, బాండ్ ఆఫరింగ్‌ల ద్వారా అదానీ గ్రూప్ ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 25,000 కోట్లు) నిధులను సమీకరించిందని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వినీత్ జైన్ కూడా నిందితులుగా ఉన్నారు. వీరిపై సెక్యూరిటీస్ మోసం, సెక్యూరిటీస్ మోసం కుట్ర మరియు వైర్ ఫ్రాడ్ కుట్ర వంటి తీవ్రమైన క్రిమినల్, సివిల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికా ఏజెన్సీల ఆధ్వర్యంలో ఈ కేసుల సమీక్ష కొనసాగుతోంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!