Site icon NTV Telugu

Funds for Bhanzu: ‘ప్రపంచంలోనే ఫాస్ట్‌ హ్యూమన్‌ క్యాలికులేటర్‌’ భాను సంస్థకి రూ.115 కోట్ల ఫండ్స్

Funds For Bhanzu

Funds For Bhanzu

Funds for Bhanzu: హైదరాబాద్‌కి చెందిన ఇంటర్నేషనల్‌ మ్యాథ్స్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ భాన్జుకి 115 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ప్రపంచంలోనే ఫాస్ట్‌గా లెక్కలు చేసే హ్యూమన్‌ క్యాలిక్యులేటర్‌ నీలకంఠ భాను ఈ సంస్థను తన పేరిటే భాన్జుగా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను మరియు మ్యాథ్స్‌ కరికులమ్‌లను ఇంకా డెవలప్‌ చేసేందుకు ఈ ఫండ్స్‌ను వినియోగిస్తామని సంస్థ సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న నీలకంఠ భాను తెలిపారు. తాజా నిధులతో భాన్జు సేవలు మరింత విస్తరించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

‘వాట్సాప్‌’కి గుడ్‌బై

వాట్సాప్‌ పేమెంట్‌ ఇండియా హెడ్ పదవి నుంచి మనేష్ మహాత్మే తప్పుకున్నారు. ఆయన మళ్లీ అమేజాన్‌ పే ఇండియాకే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మనేష్‌ మహాత్మే వాట్సాప్‌ పేమెంట్‌ ఇండియాలో 18 నెలల పాటు ఉన్నారు. అంతకుముందు అమేజాన్‌ పే ఇండియాలో డైరెక్టర్‌గా మరియు బోర్డ్‌ మెంబర్‌గా దాదాపు ఏడేళ్లు వ్యవహరించారు. మనేష్‌ మహాత్మే వైదొలిగిన విషయాన్ని వాట్సాప్‌ పేమెంట్‌ ఇండియా ధ్రువీకరించింది. ఇండియాలో వాట్సాప్‌ పేమెంట్లు పెరగటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని పేర్కొంది.

చైనా కన్నా ఇండియా బెటర్‌

విస్తరణ నిమిత్తం సిటీ గ్రూపు ఇండియాని హైప్రయారిటీ మార్కెట్‌గా భావిస్తోంది. చైనాతోపాటు ఇతర ప్రాంతాల్లో రిస్క్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికొచ్చింది. ఇండియాలో వచ్చే ఏడాది ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ పెరుగుతాయని అంచనా వేస్తోంది. దీంతోపాటు రెనివబుల్‌ ఎనర్జీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో ఇన్‌బౌండ్‌ డీల్స్‌ కూడా అధికంగా నమోదవుతాయని ఆశిస్తోంది. మేజర్‌ గ్లోబల్‌ మార్కెట్లతో పోల్చితే మన దేశంలో ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్‌ మంచి పనితీరు కనబరిచిందని సిటీ గ్రూప్‌ పేర్కొంది.

స్టాక్‌ మార్కెట్ అప్‌డేట్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ వరుసగా 3వ రోజూ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 566 పాయింట్లు కోల్పోయి 58552 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. నిఫ్టీ 169 పాయింట్లు నష్టపోయి 17460 పైన కొనసాగుతోంది. ఫోర్టిస్‌, మెక్‌లియోడ్‌, హీరో, బాంబే డయింగ్‌ స్టాక్స్‌ ఆశాజనకంగా ఉన్నాయి. టాటా స్టీల్‌ 4 శాతం ర్యాలీ చేస్తోంది. టాటా స్టీల్‌ అనుబంధ సంస్థల షేర్లు 9 శాతం పడిపోయాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.62 వద్ద కొనసాగుతోంది.

Exit mobile version