నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని కొన్ని రేజులు పెట్రో ధరల పరుగుకు కళ్లెం పడింది.. కానీ, ఎన్నికల ముగిసి.. ఫలితాలు వెలువడిన తర్వాత మళ్లీ వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి.. డీజిల్ ధర రూ.95 వరకు చేరింది.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, లీటర్ డీజిల్‌పై 24 పైసల చొప్పున వడ్డించాయి చమురు సంస్థలు.. దీంతో ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.94.23కు, లీటర్ డీజిల్ ధర రూ.85.15కు చేరింది.. దేశంలోని ఇతర ముఖ్యమైన నగరాల్లో పెట్రో ధరలను గమనిస్తే.. ముంబైలో పెట్రోల్ రూ.100.47కు చేరుకోగా.. డీజిల్ రూ.92.45గా ఉంది.. భోపాల్‌లో పెట్రోల్ రూ.102.34 కాగా, డీజిల్ రూ.93.37కు పెరిగింది.. ఇక, కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.25గా ఉంటే.. డీజిల్ రూ.87.74కు పెరిగింది.. హైదరాబాద్‌లోనూ సెంచరీవైపు పరుగులు తీస్తోంది పెట్రోల్ ధర.. హైదరాబాద్‌లో తాజా రేట్లు గమనిస్తే.. లీటర్ పెట్రోల్ ధర రూ.97.93కు చేరుకోగా.. డీజిల్ రూ.92.83గా పలుకుతోంది.
ఆగని పెట్రో బాదుడు
petrol