Site icon NTV Telugu

Bank Holidays: అలర్ట్.. వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్

ఈనెల 28, 29 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల విషయంలో అసంతృప్తిగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మె చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AICBEF), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు గతంలోనే ప్రకటించారు.

అయితే అంతకన్నా ముందు మార్చి 26న నాలుగో శనివారం, మార్చి 27న ఆదివారం కారణంగా బ్యాంకులు తెరుచుకోవు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో కలుపుకుని మార్చి 26 నుంచి 29 వరకు మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి బ్యాంకు కస్టమర్లు సెలవులు, సమ్మెను దృష్టిలో పెట్టుకురి బ్యాంకింగ్ లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Exit mobile version