Site icon NTV Telugu

Flipkart: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్

Flipkart

Flipkart

Flipkart: ప్రఖ్యాత ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రేపటి నుంచి బిగ్ దసరా సేల్ ప్రారంభించనుంది. ఈ కొత్త సేల్‌లో భాగంగా కస్టమర్లు పలు రకాల ప్రొడక్టులపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. నాయిస్ బ్రాండ్ ప్రొడక్టులపై భారీ తగ్గింపు లభిస్తుంది. స్మార్ట్ వాచ్‌లపై, ఇయర్ బడ్స్‌పై 70 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే పోకో ఫోన్లపై 45 శాతం తగ్గింపు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట ప్లస్ మెంబర్లకు ఈ సేల్ 24 గంటల ముందు నుంచే ఉంటుంది. అక్టోబర్ 8 వరకు బిగ్ దసరా సేల్ అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు.

దసరా, దీపావళి ఇవి వరుస వెంట వచ్చే ముఖ్యమైన పండుగలు. అంతేకాదు, ఎక్కువ మంది ఈ సమయంలోనే తమకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. దీంతో డిమాండ్ కు తగ్గట్టు ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పోటా పోటీగా పండుగల ప్రత్యేక విక్రయ కార్యక్రమాలను చేపడుతున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ పూర్తయిన ఐదు రోజులకే ఫ్లిప్ కార్ట్.. బిగ్ దసరా సేల్ పేరుతో మరో విడత ఆఫర్లతో కూడిన విక్రయాలను నిర్వహిస్తోంది.

Read Also: Price Down: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన నిత్యావసరాల ధరలు

ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు బిగ్ దసరా సేల్ విక్రయాలు మంగళవారం ప్రారంభం కాగా, మిగిలిన అందరికీ ఈ నెల 5 నుంచి బిగ్ దసరా సేల్ మొదలు కానుంది. ఈ నెల 8వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తోంది. టీవీలపై కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీల ధర రూ. 7,199 నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా వాషింగ్ మెషీన్ల ధర రూ. 6,990 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రిజ్‌లపై కూడా డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఏసీలపై, వాసింగ్ మెషీన్లపై 55 శాతం తగ్గింపు పొందొచ్చు.

ల్యాప్ టాప్స్ కొనుగోలు చేసే వారిపై కూడా ఆఫర్లు ఉన్నాయి. 50 శాతం వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఇంకా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, టైమ్ బాండ్ డీల్స్ వంటివి కూడా ఉంటాయి. వీటి ద్వారా అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. బై మోర్ సేవ్ మోర్ ఆఫర్ కూడా ఉంది. మూడు కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతంగా తగ్గింపు వస్తుంది. కొన్నింటిపై రెండు ప్రొడక్టులు కొన్నా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అదే ఐదు ప్రొడక్టులు కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

Exit mobile version