దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగినప్పటికీ బ్యాటరీ రీఛార్జింగ్ సమస్యల కారణంగా చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. ఒకసారి బ్యాటరీని రీఛార్జ్ చేయాలంటే కనీసం రెండు నుంచి 5 గంటల సమయం పడుతుంది. అయితే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోష్‌ను పెంచేందుకు కేంద్రం బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రటనలు చేసింది. జాతీయ రహదారులపై ప్రతి 40 కిలో మీటర్లకు ఒకచోట బ్యాటరీలను రీప్లేస్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది.
Read: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే?
దీని వలన ఛార్జీంగ్ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, ఫలితంగా డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గుతుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. టూవీలర్‌లో బ్యాటరీలను బయటకు తీసి ఛార్జింగ్ పెట్టుకునే సౌలభ్యం ఉంది. కానీ, కార్లలో అలాంటి సౌలభ్యం ఇంకా రాలేదు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లలోనూ ఇలాంటి సౌలభ్యం తీసుకురావాలని కేంద్రం చూస్తున్నది.