Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Epfo Atm Withdrawal Pf Atm Service 2025

EPFO 3.0: ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎప్పటి నుంచి అంటే..

Published Date :September 13, 2025 , 10:11 pm
By Shiva Ganesh
EPFO 3.0: ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎప్పటి నుంచి అంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

EPFO 3.0: ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏటీఎంల ద్వారా పీఎఫ్‌ డబ్బును ఉపసంహరించుకునే కొత్త సౌకర్యాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను సులభంగా నిర్వహించుకునేందుకు EPFO ​​3.0 పేరుతో కొత్త విధానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 2025లో ఈ కొత్త విధాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాటిని నిలిపివేశారు. తాజా సమాచారం ఏమిటంటే దీపావళికి ముందు ఏటీఎంల ద్వారా పీఎఫ్‌ డబ్బును ఉపసంహరించుకునే వెసులుబాటును ఖాతాదారులకు కల్పించనున్నట్లు సమాచారం. బ్యాంకుల మాదిరిగా సరళమైన లావాదేవీని సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు పేర్కొంది.

READ ALSO: Off The Record: మూడు రాజధానులపై వైసీపీ స్టాండ్ ఎందుకు మారింది..?

అక్టోబర్ 10, 11 తేదీల్లో సమావేశం..
2025 అక్టోబర్ 10, 11 తేదీల్లో ఈపీఎఫ్ఓ కార్యనిర్వాహక కమిటీ సమావేశం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరగనుంది. దీపావళికి ముందు దాదాపు 8 కోట్ల మంది పీఎఫ్ చందాదారుల నోటిఫికేషన్‌కు సంబంధించి ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఈపీఎఫ్‌వో ​​3.0 అని పిలిచే ప్రాజెక్ట్‌పై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏటీఎంల ద్వారా పీఎఫ్‌ డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యం, యూపీఐ ద్వారా పీఎఫ్‌ డబ్బును ప్రవేశపెట్టడం వంటి బ్యాంకింగ్ సేవలపై చర్చించనున్నట్లు సమాచారం. అదనంగా నెలకు కనీస పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.1,500 నుంచి రూ. 2,500 కు పెంచే ప్రణాళిక గురించి కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది.

వైద్య, విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు వంటి కొన్ని నిర్దిష్ట కారణాలతో పీఎఫ్‌ ఖాతాదారులు ఇంటర్నెట్ ద్వారా రూ. 5 లక్షల వరకు వారి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఆ డబ్బులు చేతుల్లోకి రాడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది. కొత్తగా పీఎఫ్‌లో ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తే డబ్బును తీసుకోవడం మరింత సులభతరం, వేగవంతం కానుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. బ్యాంకుల ద్వారా పీఎఫ్ డబ్బును సులభంగా పొందేలా చేయడం చేస్తే పథకం ఉద్దేశ్యమే దెబ్బతింటుందని పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పీఎఫ్ అనేది ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయంలో, అత్యవసర పరిస్థితులకు ఉపయోగించే పథకం అని వాటిని ఏటిఎంల ద్వారా తీసుకోడానికి అనుమతించేలా చేస్తే పథకం ఉద్దేశ్యం దెబ్బతింటుందని వారు అంటున్నారు.

READ ALSO: Anil Sunkara : ’ఆగడు’ అలా చేసి ఉంటే హిట్ అయ్యేది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • EPF ATM service 2025
  • EPFO 3.0
  • EPFO meeting Oct 2025
  • increase minimum pension EPFO
  • PF ATM withdrawal

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions