Site icon NTV Telugu

TCS Employees in Dilemma: గందరగోళంలో టీసీఎస్ ఉద్యోగులు.. జీతం పెంచినా.. ఉద్యోగ భద్రతపై భరోసా ఏది?

Tata Consultancy Services

Tata Consultancy Services

TCS Employees in Dilemma: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కు దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ప్రత్యేక ప్రస్థానం ఉంది. ఇటీవల ఈ కంపెనీ తరచూ తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఉద్యోగుల ఎదురుచూపులకు శుభం పలుకుతూ వారికి గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 1 నుంచి టీసీఎస్‌‌ తన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12,261 మంది ఉద్యోగులను అంతర్జాతీయంగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ న్యూస్ రావడంతో బిజినెస్ సర్కిల్‌లో వైరల్‌గా మారింది.

READ MORE: Vice President Election: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. వారికే ఆ అధికారం..

నెక్స్ట్ మంత్ నుంచే..
ఉద్యోగులకు వేతనాల పెంపు సెప్టెంబరు 1 నుంచి అమలు కానున్నట్లు కంపెనీ పేర్కొంది. జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగుల్లో దాదాపు 80% మందికి వేతనాల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఏ స్థాయిలో వేతనాల పెంపు ఉంటుందనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో టీసీఎస్‌ సీహెచ్‌ఆర్‌ఓ మిలింద్‌ లక్కడ్, కాబోయే సీహెచ్‌ఆర్‌ఓ కె.సుదీప్‌ అని తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ఏఐ టెక్నాలజీ మార్పుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12,261 మంది ఉద్యోగులను అంతర్జాతీయంగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టీసీఎస్‌ సీఈఓ కె.కృతివాసన్‌ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.ఇతర కంపెనీలూ అదే బాటలో నడిచే అవకాశం ఉందన్న ఆందోళనలూ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.

READ MORE: ACB Trap: ఏసీబీ చరిత్రలోనే తొలిసారి..! రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈఎన్సీ..

Exit mobile version