Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ త్వరలోనే సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరికీ సాధ్యంకాని విధంగా.. ‘ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్’ (World’s First Trillionaire) గా ఆయన అవతరించబోతున్నారు. రానున్న రోజుల్లో మస్క్ మొత్తం ఆస్తి విలువ ఏకంగా 1.11 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.92 లక్షల కోట్లకు పైగా) చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం పబ్లిక్ ఇష్యూ (IPO)కి రాబోతున్న ‘స్పేస్ ఎక్స్’ (SpaceX) ఈ భారీ మైలురాయిలో కీలక పాత్ర పోషించనుంది.
స్పేస్ ఎక్స్‌తో పెరగనున్న మస్క్ సంపద..
పలు నివేదికల ప్రకారం.. టెస్లా సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్ వద్ద ఇప్పటికే 273 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ షేర్లు, స్టాక్ ఆప్షన్లు ఉన్నాయి. వీటికి తోడు వచ్చే వారం స్పేస్ ఎక్స్ కంపెనీ భారీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ ఐపీఓ తర్వాత స్పేస్ ఎక్స్ మొత్తం మార్కెట్ విలువ దాదాపు 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కంపెనీలో సగానికి పైగా వాటా మస్క్ చేతిలోనే ఉంది. కంపెనీ విలువ అనుకున్న స్థాయికి చేరితే, మస్క్ నెట్ వర్త్ ఒక్కసారిగా ఎగబాకి 1.11 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఒక ట్రిలియన్ డాలర్ సంపద అంటే అది ప్రపంచంలోని అనేక దేశాల స్థూల దేశీయోత్పత్తి (GDP) కంటే ఎక్కువ. తైవాన్, ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్ వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జీడీపీ కూడా ఈ మార్కు కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. అయితే మస్క్ సంపద అంతా ఆయన కంపెనీల షేర్ల విలువపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, టెస్లా లేదా స్పేస్ ఎక్స్ షేర్ల ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల ఆయన ఆస్తి విలువ మారుతూ ఉంటుంది.
Also Read
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
ఆ నలుగురు బిలియనీర్ల సంపద ఒకవైపు.. మస్క్ ఒకవైపు
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఒకవేళ ఆయన సంపద అంచనా వేసినట్లుగా 1.11 ట్రిలియన్ డాలర్లకు చేరితే.. టాప్-10 బిలియనీర్ల జాబితాలో ఆయన తర్వాతి స్థానాల్లో ఉన్న నలుగురు సంపన్నుల మొత్తం ఆస్తి కంటే మస్క్ ఆస్తి ఎక్కువగా ఉంటుంది. గూగుల్ కో-ఫౌండర్లు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్, అమెజాన్ జెఫ్ బెజోస్.. ఈ నలుగురి ఆస్తి మొత్తం విలువ ప్రస్తుతం 1.09 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం.. ఎలాన్ మస్క్ ప్రస్తుత నికర ఆస్తి విలువ సుమారు 707 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది (2026)లో ఇప్పటి వరకు ఆయన సంపద ఏకంగా 87.5 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. స్పేస్ ఎక్స్ ఐపీఓ గనుక విజయవంతమైతే, మస్క్ ట్రిలియనీర్ క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!