Site icon NTV Telugu

Elon Musk Twitter Deal: ముదురుతున్న వివాదం.. ట్విట్టర్​ పై మస్క్​ కౌంటర్ దావా

Alonmask

Alonmask

టెస్లా అధినేత , ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ పై ఎదురుదాడికి దిగారు. మస్క్‌, మైక్రో బ్లాగింగ్‌ సైట్ ట్విట్టర్ మధ్య లీగల్‌ వార్‌ మరింత ముదురుతోంది. అయితే.. ట్విట్టర్​ తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి టెస్లా అధినేతపై దావా వేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. తాజాగా ట్విట్టర్ దావాను సవాల్‌ చేస్తూ మస్క్ కూడా కౌంటర్‌ దావా వేశారు. మస్క్‌ పై ట్విట్టర్ వేసిన దావాపై ఈ ఏడాది అక్టోబరులో విచారణ జరపనున్నట్లు డెలావర్‌ కోర్టు ఆదేశాలు వెలువరించిన కొద్ది గంటలకే మస్క్‌ ఎదురు దాడికి దిగాడు. మస్క్‌ కూడా సవాల్‌ చేస్తూ ట్విట్టర్‌ పై దావా వేయడం చర్చనీయాంశంగా మారింది.

read also: Thirty Five Years for Bala Krishna Ramu Movie : బాలకృష్ణ ‘రాము’కు 35 ఏళ్ళు

ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్​ ను 44 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్‌ వెల్లడించారు. దీంతో.. ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. మస్క్‌ షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డెలావర్‌లోని ఓ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈనేపథ్యంలో.. ఒప్పందంలో అంగీకరించినట్లుగా ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద కొనుగోలు చేసేలా ఆదేశించాలని కోరింది. దీంతో.. ఈ పిటిషన్‌ను నిన్న స్వీకరించిన డెలావర్‌ కోర్టు.. అక్టోబరు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు దీనిపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. అయితే.. మస్క్‌ సామాజిక మాధ్యమంపై కౌంటర్‌ దావా వేసిన.. మస్క్‌ వేసిన దావాపై ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ట్విట్టర్ షేరు విలువ 41.61 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయ్యింది. అయితే.. మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ట్విట్టర్ షేర్లు భారీగా పతనమయ్యాయని.. అయితే షేర్లు మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.

Sarath Babu Birthday Special : వైవిధ్యంతోనే శరత్ బాబు పయనం!

Exit mobile version