Elon Musk arranged bedrooms in the Twitter office: ట్విట్టర్ హెడ్ క్వార్టర్ ఆఫీసు రూములను బెడ్రూంలుగా మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆఫీస్ స్పేస్ ను పడక గదులుగా మార్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: CM KCR: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్.. రైతుబంధుపై క్లారిటీ..
మంగళవారం ఈ విషయమై శాన్ ప్రాన్సిస్కో మేయర్ లండన్ బ్రీడ్ పై విమర్శలు గుప్పించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్ క్వార్టర్ లో బెడ్రూంలు ఏర్పాటు చేసినందుకు ట్విట్టర్ పై దర్యాప్తు జరుగుతోందని.. అలసిపోయిన ఉద్యోగులకు పడకలు ఏర్పాటు చేసినందుకు కంపెనీపై అన్యాయంగా దాడి జరుగుతోందని అన్నారు. ఇటీవల ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో బెడ్రూంలు ఏర్పాటు చేసింది. బెడ్రూంల గురించి ఫిర్యాదు చేసినందుకు బిల్డింగ్ కోడ్ ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సంబంధిత శాఖ బిల్డింగును తనిఖీ చేస్తామని చెప్పింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడటం లేకపోవడంతో ఎలాన్ మస్క్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పనిగంటలు ఎక్కువ అయితే.. ఉద్యోగులు నిద్ర అవసరం అందుకే ట్విట్టర్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ చివరి నెలలో 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు ఎలాన్ మస్క్. వచ్చీరావడంతోనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర సీఈఓతో పాటు మరికొంతమంది ముఖ్యమైన ఉద్యోగులను తీసేశారు. దీంతో పాటు 50 శాతం మంది ఉద్యోగులు, 3700 మంది ఉద్యోగులను తీసేసింది. ఇక ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు ఇకపై నెలకు డబ్బు చెల్లించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు.
