NTV Telugu Site icon

Edible Oil Prices: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు

Oil Prices

Oil Prices

Edible Oil Prices: సామాన్యులకు మళ్లీ షాక్ తగలనుంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన వంటనూనె ధరలు మళ్లీ పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. గతంలో లీటర్ వంటనూనె రూ.200 దాటగా అప్రమత్తమైన కేంద్రం తగుచర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం లీటర్ ఆయిల్ ప్యాకెట్ రూ.140-150కి లభిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయిల్ దిగుమతి సుంకాలు పెంచడంతో ఆ భారం వినియోగదారులపైనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడి పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952 డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో ధరల నియంత్రణలో భాగంగా ముడి పామాయిల్‌పై దిగుమతి ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఆయిల్ దిగుమతి సుంకాలను పెంచడంతో త్వరలో వంటనూనెల ధరలు పెరగనున్నాయి.

Read Also: Janasena Social Audit: జనసేన సోషల్ ఆడిట్.. కొత్త తరహాలో వాస్తవాలు వెలికితీస్తాం..!

ఆయిల్ సీడ్ ధరలు తగ్గడంతో రైతులను ఆదుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తోంది. దేశీయంగా రైతులకు ప్రోత్సహించడానికి క్రూడ్ పామ్ ఆయిల్‌కు, ఆర్‌బీడీ మధ్య సుంకం వ్యత్యాసం 12 నుంచి 13 శాతం వరకు ఉండాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ అధిక మొత్తంలో ఆయిల్‌ను రష్యా, ఉక్రెయిన్, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే ఆయా దేశాల్లో ఇటీవల భారీ వర్షాలు కురవడం, అలాగే డిమాండ్ పెరిగిపోవడం వంటి అంశాల కారణంగా కూడా వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Show comments