ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ షియోమీకి షాక్‌ఇచ్చింది.. ఏకంగా రూ.5,551.27కోట్ల డిపాజిట్లను స్తంభింపజేసింది.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది ఈడీ.. చైనాకు చెందిన షియోమీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన షియోమీ ఇండియా.. 2014 ఏడాది నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తుంది.. కానీ, భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాది నుంచే.. అంటే 2015 ఏడాది నుంచే ఆ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. ఇక, ఈ వ్యవహారంపై 2022 ఫిబ్రవరిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఈడీ.. షియోమీ గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు మళ్లించినట్టు గుర్తించింది. మాతృక సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసినట్టుగా వెలికితీసింది.. ఇది ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధమని అందుకే ఆ సంస్థ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది.
Read Also: Amaravati: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 2 నెలలు ఉచితంగానే..
