Site icon NTV Telugu

Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ లుక్ అవుట్ నోటీస్.. రూ.3,000 కోట్ల లోన్ మోసం?

Anil Ambani

Anil Ambani

Anil Ambani: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాక్ ఇచ్చింది. రూ.3,000 కోట్ల లోన్ మోసం కేసుకు సంబంధించి ఈడీ తాజాగా లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. గురువారం అనిల్ అంబానీకి విచారణకు హాజరుకావాలని సమన్లు పంపిన ఈడీ, మరుసటి రోజే నోటీసులు జారీ చేయడం గమనార్హం. అసలు లుక్ అవుట్ నోటీసులు అంటే.. సంబంధిత వ్యక్తి దేశాన్ని వదిలి వెళ్లకుండా ఉండటానికి తీసుకునే చర్య.

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కర్ ఉగ్రవాదులు ట్రాప్..

ఇలా చేయడం ద్వారా ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, ఇతర మార్గాల వద్ద నోటీసు జారీ అయిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఇప్పుడు అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లాలంటే ఈడీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు 2017 నుంచి 2019 మధ్యకాలానికి సంబంధించినది. ఈ సమయంలో రిలయన్స్ కంపెనీలు యస్ బ్యాంక్ నుంచి రూ.3,000 కోట్ల లోన్లు తీసుకున్నాయి.

Anil Ravipudi: నా కెరీర్‌లో చేసిన విభిన్న ప్రయత్నం.. నేషనల్‌ అవార్డుపై స్పందించిన అనిల్‌ రావిపూడి!

అయితే, ఈ నిధులను అనిల్ అంబానీ ఇతర మార్గాల్లోకి దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు నుంచి లోన్ మంజూరు చేయడానికి ముందు ప్రమోటర్ల ఖాతాల్లో భారీగా నిధులు చేరినట్లు ఈడీ గుర్తించింది. దీన్ని క్విడ్ ప్రో కో వ్యవహారంగా ఈడీ అభివర్ణిస్తోంది. దీనితో ఈ కేసులో సంబంధం ఉన్న 50 సంస్థలపై జూలై 24వ తేదీ నుంచి ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు మూడు రోజులపాటు సాగాయి. ప్రస్తుతం లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో కేసు మరింత కొత్త మలుపు తిరిగింది. అనిల్ అంబానీపై ఈ చర్యలతో బిజినెస్ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది.

Exit mobile version