Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Shopping : మొబైల్లో ఒక ఆఫర్ కనిపించగానే వెంటనే కార్ట్‌లో వస్తువులు వేసేయడం, అవసరం లేకపోయినా డిస్కౌంట్ ఉందనే కారణంతో కొనేయడం.. ఇవి ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారిపోయాయి. ఆన్లైన్ షాపింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత షాపింగ్ అనేది అవసరం కోసం కాకుండా ఒక వినోదంగా కూడా మారింది. అయితే ఈ అలవాటు వల్ల తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లులు, అనవసర ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితికి ఒక వినూత్న పరిష్కారం దక్షిణ కొరియాలో వైరల్ అవుతోంది. అక్కడి యువత ఇప్పుడు గంటల తరబడి ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నా.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. అసలు ఇది ఎలా సాధ్యమవుతోంది? ఈ కొత్త ట్రెండ్ వెనుక ఉన్న సంగతి ఏమిటి?
దక్షిణ కొరియాలో ప్రస్తుతం “డోపమైన్ సైట్లు”గా పిలిచే ప్రత్యేకమైన వెబ్సైట్లు, యాప్‌లు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి చూడటానికి అచ్చం ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే ఉంటాయి. వేలాది ఉత్పత్తులు, భారీ డిస్కౌంట్లు, వినియోగదారుల రేటింగ్‌లు, రివ్యూలు, సెర్చ్ ఫిల్టర్లు అన్నీ నిజమైన షాపింగ్ యాప్‌లలో ఉన్నట్లే కనిపిస్తాయి. వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను ఎంపిక చేసుకుని కార్ట్‌లో వేసుకోవచ్చు. చిరునామా నమోదు చేయవచ్చు. చివరికి ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. డెలివరీ కూడా మీ ఇంటి వరకు వచ్చనట్లు చూపిస్తుంది. అయితే అక్కడితో కథ ముగుస్తుంది. ఎలాంటి చెల్లింపు జరగదు. మీ ఇంటికి వస్తువు కూడా రాదు.
Also Read
- Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
- Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
- Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
- Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
ఈ యాప్‌ల ప్రత్యేకత ఏమిటంటే, ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అసలైన అనుభవాన్ని కలిగించేలా వర్చువల్ డెలివరీ ప్రక్రియను చూపిస్తాయి. డెలివరీ బాయ్ బయలుదేరినట్లు, మ్యాప్‌లో అతని లొకేషన్ కనిపించినట్లు, మీ ఆర్డర్ ప్రయాణిస్తున్నట్లు చూపిస్తూ వినియోగదారుడికి నిజంగానే షాపింగ్ చేసిన అనుభూతిని కలిగిస్తాయి. అయితే చివరికి ఎలాంటి వస్తువు డెలివరీ కాదు. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఒక్క పైసా కూడా కట్ కాదు.
మనస్తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం, చాలా మంది షాపింగ్‌లో ఆనందాన్ని పొందేది వస్తువు కొనుగోలు చేయడంలో మాత్రమే కాదు. వస్తువులను వెతకడం, వాటిని పోల్చి చూడడం, కార్ట్‌లో జోడించడం, ఆర్డర్ కోసం ఎదురుచూడడం వంటి మొత్తం ప్రక్రియలోనే మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. అదే ఉత్సాహం, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మానసిక ప్రక్రియనే ఈ డోపమైన్ సైట్లు ఉపయోగించుకుంటున్నాయి.
దక్షిణ కొరియాలో లివింగ్ కాస్ట్, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో యువత ఖర్చులను నియంత్రించేందుకు ఈ విధానం ఒక ప్రత్యామ్నాయంగా మారుతోంది. నిజమైన షాపింగ్ చేసినంత సంతృప్తి లభిస్తుందని, కానీ నెలాఖరులో భారీ బిల్లు మాత్రం రాదని అక్కడి యువత చెబుతున్నారు. కొందరు దీన్ని షాపింగ్ వ్యసనాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే తక్కువ ఖర్చు పరిష్కారంగా కూడా అభివర్ణిస్తున్నారు.
అయితే అందరూ ఈ ట్రెండ్‌ను సమర్థించడం లేదు. కొంతమంది మానసిక ఆరోగ్య నిపుణులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. డబ్బు ఖర్చు కాకపోయినా, తరచూ షాపింగ్ చేసే అలవాటును ఈ యాప్‌లు మరింత బలపరిచే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అంటే ఆర్థిక నష్టం తప్పించుకోవచ్చు కానీ, షాపింగ్‌పై ఆధారపడటం మాత్రం అలాగే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వినూత్న ధోరణి ప్రధానంగా దక్షిణ కొరియాలోనే కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. కొందరు దీన్ని తెలివైన ఆలోచనగా ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇది సమయ వృథా మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, డిజిటల్ యుగంలో వినియోగదారుల ప్రవర్తన ఎలా మారుతోందో చూపించే ఆసక్తికరమైన ఉదాహరణగా ఈ “డోపమైన్ షాపింగ్” ట్రెండ్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
-
Ashwini Vaishnaw : జర్నలిజానికి డీపీఎడీపీ చట్టంతో ముప్పు లేదు
-
Tiny Holes in Clothes: అల్మారాలోని బట్టలకు చిన్న రంధ్రాలా? ఎలుకలు కాకపోవచ్చు.. ఈ కీటకాలతో జాగ్రత్త!
-
BJP: ఎస్పీ గెలవకూడని చోట్ల గెలిచింది.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..