Trump Tariff Bomb: ట్రంప్ 25% టారిఫ్ బాంబు.. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు భారీ దెబ్బ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariff Bomb: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్ట్ 1 నుంచి భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టారిఫ్ వల్ల ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ రంగాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్-అమెరికా ట్రేడ్ సర్ప్లస్‌పై లక్ష్యంగా ట్రంప్ చర్యలు చేపట్టారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో వ్యాఖ్యానిస్తూ.. భారత్ మిత్ర దేశమయినప్పటికీ, గతంలో తక్కువ వ్యాపారమే జరిగిందని.. ఎందుకంటే, వారి టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, నాన్-మానిటరీ ట్రేడ్ బారియర్స్ కూడా ప్రపంచంలోనే అత్యధికంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేగాక, భారత్-రష్యా సంబంధాలు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
India-US Tariffs: 25 శాతం సుంకాలు.. భారత్ నెక్ట్స్ ప్లాన్‌ను వివరించిన మంత్రి..
2025 ఆర్థిక సంవత్సరానికి గాను, అమెరికాతో భారత ట్రేడ్ సర్ప్లస్ 41.18 బిలియన్ డాలర్స్ దాటింది. ఇందులో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 11.6 శాతం పెరిగి 86.5 బిలియన్ డాలర్స్ కు చేరుకోగా.. దిగుమతులు 7.4 శాతం పెరిగి 45.3 బిలియన్ డాలర్స్ కు చేరుతుంది. ఈ పెరిగిన వ్యత్యాసాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయమై ఎలారా కాపిటల్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ ప్రకారం.. ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి పోటీ దేశాలపై తక్కువ టారిఫ్‌లు ఉంటే, భారత్‌పై 25% టారిఫ్ విధించడం ఆర్థికంగా నష్టాన్ని తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు.
అమెరికాకు భారత్ ఎగుమతిచేసే టాప్-5 ఉత్పత్తులు ఇలా ఉన్నాయి. ఇందులో మొదటగా.. 2025 రెండో త్రైమాసికంలో భారత్, చైనాను అధిగమించి అమెరికాకు అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ సరఫరాదారుగా మారింది. భారత స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధర, అధిక ఫీచర్లతో అమెరికాలో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. జనవరి 2025 నాటికి ఈ రంగం 3 బిలియన్ డాలర్స్ కు పైగా ఎగుమతులు సాధించింది. దీని తర్వాత ఆసియాలో రెండో అతిపెద్ద రిఫైనింగ్ హబ్‌గా భారత్ పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, గ్యాసొలిన్, ఎల్‌పీజీ వంటివి అమెరికాకు భారీగా ఎగుమతిస్తోంది. 2024 నాటికి ఈ రంగం 20 బిలియన్ డాలర్స్ ఎగుమతుల విలువ సాధించింది.
Pakistan Train: ఇది రైలా.? లేక యమలోకానికి దారి చూపే వాహనమా..? వీడియో వైరల్..!
అలాగే అమెరికా భారత ఆభరణాలకి అతిపెద్ద కొనుగోలుదారు. డైమండ్లు, బంగారు నగలు సహా రఫ్ రత్నాలు, హస్త కళా మాణిక్యాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంటుంది. గత ఏడాది ఈ రంగం 8.5 బిలియన్ డాలర్స్ దాటి ఎగుమతులు చేసింది. ఇక భారత్ ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా జెనరిక్ మందులు, వ్యాక్సిన్లు, API లు అమెరికాకు అందిస్తోంది. 2025 నాటికి భారత ఫార్మా ఎగుమతులు 7.5 బిలియన్ డాలర్స్ దాటాయి. అలాగే సిల్క్ హ్యాండ్లూమ్స్ నుంచి కాటన్ గార్మెంట్ల వరకు, అమెరికా మార్కెట్‌లో భారత బట్టలకు మంచి గిరాకీ ఉంది. 2025లో ఈ రంగం 2.5 బిలియన్ డాలర్స్ పైగా ఎగుమతులు నమోదు చేసింది.
కాబట్టి ట్రంప్ కొత్త టారిఫ్ విధానం భారత వ్యాపార రంగాలకు గట్టి దెబ్బగా మారనుంది. ఎగుమతులపై ఆధారపడి ఉన్న ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆభరణాలు, టెక్స్టైల్ ప్రధాన రంగాలు ఈ టారిఫ్ బాంబుతో నష్టాన్ని మూటగట్టుకునే అవకాశముంది. దీనికి వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం, వ్యాపార సంఘాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే. ఈయూ దేశాల మధ్య చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలే ఈ సమస్య నుండి భారత పరిశ్రమలకు ఊతం కానున్నాయి.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!