Buy Gold For ₹1: రూపాయికే బంగారం.. ఎక్కడ అమ్ముతున్నారో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buy Gold For ₹1: పసిడిలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా కాలంగా భారతీయులలో ఉన్న సంప్రదాయం. కానీ కాలక్రమేణా బంగారం కొనుగోలు ప్రక్రియ మారిపోయింది. గతంలో ప్రజలు నగలు లేదా నాణేలు వంటి బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది డిజిటల్ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి డిజిటల్ బంగారాన్ని రూపాయి నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించవచ్చు తెలుసా.. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని కీలక అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Rohit Sharma: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్!
Also Read
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ మార్పు.. ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త సెటిల్మెంట్ రూల్స్..!
- AI: ఏఐ బూమ్‌కు బ్రేకులు.. దెబ్బకు బుడగ పేలింది..!
- Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
డిజిటల్ బంగారం..
డిజిటల్ బంగారం 24 క్యారెట్లు లేదా 99.99% స్వచ్ఛమైన బంగారం. దీనికి తయారీ ఛార్జీలు లేదా వృథా ఖర్చులు ఉండవు. అలాగే దీనిని సురక్షితమైన, బీమా చేసిన వాల్ట్‌లలో నిల్వ చేస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే 24 గంటలు, వారంలో 7 రోజులు ఏ మొత్తంలోనైనా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. అది రూ.1 నుంచి రూ.10 లక్షల రూపాయలు కొనుగోలు చేయవచ్చు. కావాలనుకుంటే తరువాత ఈ మొత్తం బంగారాన్ని నాణేలు లేదా బార్ల రూపంలో భౌతిక డెలివరీని కూడా తీసుకోవచ్చు. డిజిటల్ బంగారంపై 3% GST మాత్రమే వర్తిస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ వీటిపై బయటికి తెలియని అనేక ఖర్చులు ఉన్నాయి. వీటిలో ప్లాట్‌ఫామ్ పంపిణీ రుసుములు, UPI లేదా చెల్లింపు గేట్‌వే ఛార్జీలు, నిల్వ, కస్టడీ రుసుములు, అలాగే డెలివరీ ఛార్జీలు కూడా ఉన్నాయి. ఇవి ప్రారంభంలో చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవి దీర్ఘకాలికంగా పెట్టుబడి మొత్తం ఖర్చును పెంచుతాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు ఈ ఛార్జీలన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
డిజిటల్ బంగారం భద్రత ఎక్కువగా పెట్టుబడి పెట్టే ప్లాట్‌ఫామ్, దాని వాల్ట్ భాగస్వామిపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొన్ని కంపెనీలు తమ వాల్ట్‌లకు ఆడిట్లను నిర్వహించి బహిరంగంగా నివేదికలను ప్రదర్శిస్తాయి. కానీ మరికొన్ని అలా చేయవు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు, ప్లాట్‌ఫామ్ పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. రూ.1 లేదా రూ.10 ప్రారంభించి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతి నెలా చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ద్వారా క్రమంగా మీ బంగారు పొదుపును పెంచుకోవచ్చు. దీనికి డీమ్యాట్ ఖాతా కూడా అవసరం లేదు. వాస్తవానికి ఇది అనుభవం లేని పెట్టుబడిదారులకు సులభమైన ఎంపికగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వీటిని తెలుసుకోండి..
ప్రస్తుతం డిజిటల్ బంగారంపై SEBI లేదా RBI నుంచి ప్రత్యక్ష నిబంధనలు లేవు. ప్రతి కొనుగోలుపై 3% GST చెల్లించాల్సి ఉంది. మీరు కొనుగోలు చేసిన డిజిటల్ బంగారాన్ని మూడు ఏళ్లలోపు విక్రయిస్తే, వచ్చిన లాభంపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే మీరు ఆ బంగారాన్ని మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, అది దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించబడి, దానికి 20% పన్ను మాత్రమే విధించబడుతుంది. అలాగే దీనికి అదనంగా ఇండెక్సేషన్ ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Affordable Smart Projector: 100-inch TV ఇప్పుడు రూ.5,000లో!
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!