NTV Telugu Site icon

Crorepati Factory Meesho: మీషోది మామూలు షో కాదు. కోటీశ్వరుల తయారీ ఫ్యాక్టరీగా అరుదైన గుర్తింపు

Crorepati Factory Meesho

Crorepati Factory Meesho

Crorepati Factory Meesho: మన దేశంలోని మొట్టమొదటి సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం అయిన మీషో.. లక్షాధిపతులను తయారుచేసే ఫ్యాక్టరీగా పేరొందుతోంది. ఇప్పటివరకు లక్షా 23 వేల మంది చిన్న వ్యాపారులను లక్షాధికారులను చేసింది. టయర్‌-2 నుంచి టయర్‌-4 సిటీల వరకు యూజర్‌ పెనట్రేషన్‌ విషయంలో మీషో.. అమేజాన్‌ మరియు ఫ్లిప్‌కార్ట్‌లను అధిగమించింది. యాప్‌ సైజ్‌, డూయింగ్‌ బిజినెస్‌ వీడియోలు, మంత్లీ విజిట్స్‌తో మీషో రూరల్‌ ఏరియాల్లోకి కూడా శరవేగంగా విస్తరిస్తోంది.

ఒక్క ఆగస్టు నెలలోనే మీషో యూజర్ల సంఖ్య 127 మిలియన్‌లకు పైగా నమోదుకావటం గమనించాల్సిన విషయం. దీంతో ఈ యూనికార్న్‌ కస్టమర్‌ మరియు సెల్లర్‌ గ్రోత్‌ ఈ రేంజ్‌లో పెరగటం వెనక ఉన్న సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మీషోని సెల్లర్స్‌కి దగ్గర చేస్తున్న ముఖ్యాంశం ‘వేగం’ అని తేలింది. ఈ యాప్‌ని ఇప్పటివరకు 360 మిలియన్‌ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇందులో 175 మిలియన్‌ డౌన్‌లోడ్లు గత ఏడాది వ్యవధిలోనే జరగటం విశేషం.

read also: UPI Lite: పిన్‌, మొబైల్ డేటా లేకున్నా ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.

తగ్గుతూనే ఉన్న ఫారెక్స్‌ నిల్వలు

ఇండియా విదేశీ మారక నిల్వలు అంతకంతకూ తగ్గుతూనే ఉన్నాయి. ఈ నెల 16వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్‌ రిజర్వ్‌ దాదాపు 522 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 54 వేల 562 కోట్ల డాలర్లకు పడిపోయాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో దీన్ని నివారించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేపడుతున్న చర్యల కారణంగా విదేశీ మారక నిల్వలు పతనమవుతున్నాయి.

లక్షల కోట్లు ఆవిరి

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లపై విదేశీ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావం బాగా పడింది. దీంతో నిన్న ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 5 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్‌ వెయ్యీ 20 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 17 వేల 400లకు దిగువకు పరిమితం కావాల్సి వచ్చింది. పవర్‌, రియల్టీ, బ్యాంకింగ్‌ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ ఏడాది సూచీల లాభాలన్నీ కరిగిపోయాయి. ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ వర్గాలను భయాందోళనలకు గురిచేశాయి.

Show comments