Site icon NTV Telugu

Credit Card: డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు బిల్లు కట్టొచ్చు.. పోలా అదిరిపోలా..

Criead Card

Criead Card

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం సాధారణమైపోయింది. చాలా మంది తమ ఇంటి రెంట్‌, కరెంట్ బిల్లు చెల్లింపులు, షాపింగ్, రీఛార్జ్, సబ్‌స్క్రిప్షన్‌లు మొదలైన వాటి కోసం క్రెడిట్ కార్డ్‌లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే, నిర్ణీత సమయంలో ఎలాంటి వడ్డీ లేకుండా కార్డులు వినియోగించుకునే ఛాన్స్ ఉండటంతో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. పైగా మన పాకెట్‌ లోని డబ్బు ఆదా అవడానికి సహాయపడే పలు క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్ల వంటి ఆఫర్లు కూడా క్రెడిట్‌ కార్డులపై వస్తుండటంతో వీటిని తెగ వాడేస్తున్నారు.

Read Also: PM Modi: అమెరికా పర్యటన ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది..

కొంతమంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే బిల్లు జనరేట్‌ అయిన తర్వాత నిర్ణీత గడువులోపు కార్డు బిల్లు కట్టకపోతే మాత్రం అదొక పీడకలగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్రెడిట్‌ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకర్లు భారీగా వడ్డీ వసూలు చేస్తారు. అందుకు తగిన నగదు మీ వద్ద ఉంటే ఇబ్బంది లేదు.. ఒకవేళ టైంకి డబ్బులు లేకపోతేనే అసలు ఇబ్బంది. అయితే అటువంటి సందర్భంలో మిమ్మల్ని వడ్డీల భారం నుంచి తప్పించే ఓ ఆప్షన్‌ ఉంది. అది ఏంటంటే.. క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ ఫర్‌ ఆప్షన్‌.

Read Also: Kidney Disease: మూత్రపిండానికి మధుమేహ గండం

దాదాపు అన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులపైనా బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్‌ ఎంటంటే.. ఒక కార్డులోని అవుట్‌ స్టాండింగ్‌ మొత్తాన్ని మరో కార్డుపైకి బదిలీ చేయడం అన్నమాట. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. అలా రెండు మూడు కార్డులు వాడుతున్న వారికి ఈ ఆప్షన్‌ బాగా అవసరం పడుతుంది. ఏదైనా కార్డు బిల్లు చెల్లింపు సమయానికి మీ దగ్గర సరిపడిన నగదు లేకపోతే ఆ మొత్తాన్ని మరో కార్డుపైకి బదిలీ చేసేయొచ్చు. దీంతో మళ్లీ ఆ కార్డు బిల్లు జనరేట్‌ అయ్యి.. బిల్లు చెల్లింపు తేదీ వచ్చే వరకూ మీకు ఆ డబ్బు చెల్లించడానికి ఛాన్స్ ఉంటుంది.

Read Also: Chittoor Crime: దారుణం.. వరుసకి కొడుకు, సహజీవనం చేయాలంటూ..

అయితే ఈ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ వినియోగించాలంటే దానికి ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు ఇతర చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తు పెట్టుకోవాలి. ఈ చార్జీలు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ఆ ఆప్షన్‌ వినియోగించుకొనే ముందు ఈ నిబంధనలు, చార్జీల వంటి వివరాలు మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Exit mobile version