Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Condom Prices: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా వినియోగ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉధృతి కారణంగా, ప్రపంచవ్యాప్తంగా కండోమ్ ధరలు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరగనున్నాయి. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టనున్నాయి. యుద్ధ భయాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ ‘కారెక్స్’ (Karex) ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం కేవలం ఒక వస్తువుకే పరిమితం కాకుండా, విమాన ప్రయాణాలు, నిత్యావసరాలపై కూడా పడనుంది.
ధరల పెరుగుదలకు కారణాలేంటంటే..
కారెక్స్ సీఈఓ గో మియా కియాట్ (Goh Miah Kiat) వెల్లడించిన వివరాల ప్రకారం.. కండోమ్ తయారీకి అవసరమైన అమ్మోనియా, సిలికాన్ ఆధారిత లూబ్రికెంట్లు వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ గ్యాస్‌లో ఐదో వంతు హోర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. అక్కడ సైనిక ఆంక్షలు, నాకేబందీ కారణంగా రవాణా వ్యయం భారీగా పెరిగింది. విచిత్రంగా యుద్ధం లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో కండోమ్స్‌కు డిమాండ్ 30% పెరిగింది. ఉద్యోగ భద్రత లేనప్పుడు ప్రజలు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, అందుకే డిమాండ్ పెరిగిందని సంస్థ తెలిపింది. కారెక్స్ సంస్థ ఏటా 500 కోట్లకు పైగా కండోమ్స్‌ను తయారు చేస్తూ డ్యూరెక్స్ (Durex), ట్రోజన్ (Trojan) వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేస్తోంది.
Also Read
- RBI: ఆర్‌బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ఇతర రంగాలపై ప్రభావం..
హోర్ముజ్ ఉద్రిక్తతల వల్ల కేవలం కండోమ్స్ మాత్రమే కాదు, మరికొన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి. అవి ఏంటంటే.. గత ఏడాదితో పోలిస్తే ఎకానమీ క్లాస్ విమాన టికెట్ల ధరలు సగటున 24% పెరిగాయి. ఇదే సమయంలో రవాణా ఖర్చులు పెరగడంతో చక్కెర, డెయిరీ ఉత్పత్తులు, పండ్ల ధరలు కూడా పెరగనున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. హీలియం గ్యాస్ కొరత కారణంగా కంప్యూటర్ చిప్స్ తయారీ మందగించి, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!